18 Times Lottery Winner: డబ్బు, లగ్జరీ కార్లు మాత్రమే జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇస్తాయని అనుకునే వారికి అమెరికాకు చెందిన రాబర్ట్ బెవన్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు.
సాధారణంగా ఒకే ఒక్కసారి లాటరీ తగిలినా జీవితం మారిపోయిందని గర్వపడే ఈ రోజుల్లో, ఏకంగా 18 సార్లు వివిధ రకాల లాటరీ జాక్‌పాట్‌లు గెలుచుకున్న రాబర్ట్ మాత్రం నేల మీదే ఉన్నారు. 1997లో ఒక లగ్జరీ కారు గెలవడంతో ప్రారంభమైన ఆయన అదృశ్య ప్రయాణం, ఇటీవల రూ. 41 లక్షల నగదు బహుమతి గెలవడంతో 18వ సారికి చేరింది. మధ్యలో ఆయన రూ. 1.6 కోట్ల భారీ జాక్‌పాట్‌ను కూడా సొంతం చేసుకున్నారు.
18 Times Lottery Winner:40 ఏళ్ల వైవాహిక బంధమే నా సక్సెస్ సీక్రెట్ అన్న రాబర్ట్

అయితే, లాటరీ అధికారులు ఆయన విజయ రహస్యాన్ని అడగ్గా, రాబర్ట్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. తనకు దక్కిన కోట్ల రూపాయల నగదు కంటే, తన జీవితంలో 40 ఏళ్లుగా తోడుగా ఉన్న తన భార్యే అత్యంత పెద్ద అదృష్టమని ఆయన భావోద్వేగంగా చెప్పారు. భార్యతో కలిసి సరదాగా గడపడానికి, ఒక వినోదంగా మాత్రమే తాము టిక్కెట్లు కొనేవాళ్లమని స్పష్టం చేశారు. ఈ కథనం ద్వారా డబ్బు కంటే బంధాలే జీవితంలో అత్యంత విలువైనవనే గొప్ప సందేశం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

