Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోట్లల్లో కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు.. సీఈఓ మోసాలపై టిజిసిఎస్ బి హెచ్చరిక

కోట్లల్లో కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు.. సీఈఓ మోసాలపై టిజిసిఎస్ బి హెచ్చరిక

వార్త 1 week ago

TG Cyber Security Bureau: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు చెందిన డైరక్టర్లు, సీఈఓల పేరిట సైబర్ నేరగాళ్లు ఆయా సంస్థల ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్స్ పెడుతూ లక్షల రూపాయల నుంచి కోట్లాది రూపాయలను కాజేస్తున్న ఉదంతాలపై అన్ని వర్గాల వారు అప్రమత్తంగా వుందాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్ బి) హెచ్చరించింది.

ఈ మేరకు టిజిసిఎసిబి డైరక్టర్ శిఖా గోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెం టర్ (14సి) ఈ విషయమై ఇప్పటికే హెచ్చరించిందని ఆమె వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు విదేశాల నుంచి సంస్థలను టార్గెట్ చేస్తూ ఆయా సంస్థల డైరక్టర్లు, సీఈఓల పేర్లు చెబుతూ వారి ఫోటోలు వుంచుతూ వాట్సాప్ మెసేజలు పంపుతూ వెంటనే డబ్బులు సంపాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 300 పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని, ఇవి మరింత పెరిగే ప్రమాదం వుందని ఆమె తెలిపారు.

Read Also : Anand Mahindra helps: 80 ఏళ్ల వయసున్న వయోలిన్ విద్వాంసుడికి ఆనంద్ మహీంద్రా సాయం

 Cyber ​​criminals making crores.. TGCSB warns on CEO scams

TG Cyber Security Bureau: విదేశాల నుంచి వ్యూహాత్మకంగా దాడులు

సైబర్ నేరగాళ్లు ఒక పథకం ప్ర కారం అత్యవసర పరిస్థితుల అంశాన్ని చెబుతున్నారని, ఆయా సంస్థలు వాడే అత్యవసర అధికారిక సమాచారం వంటి అంశాలను వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు. నేరగాళ్లు పంపే మెసేజ్ ను కంపెనీల ఉద్యోగులు తెరిస్తే మాల్వేర్ ద్వారా కంప్యూటర్లో ఒక రకమైన సమాచార దోపిడి ఉపకరణం జొరబడుతుందని ఆమె తెలిపారు. దీనివల్ల కొన్నిసార్లు ఆయా సంస్థలు, కంపెనీల రహస్య సమాచారం కూడా చోరీకి గురవుతుందని శిఖా గోయల్ తెలిపారు. అనూహ్యంగా వచ్చే జెడ్వపి లేదా ఆర్ఎఆర్ ఫైళ్లను తెరవకూడదని, అర్జంట్ కంప్లయన్స్ లేదా ఇమిడియట్ యాక్షన్ రిక్వైర్డ్ అనే సందేశాలను పట్టించుకో వద్దని, అనుమతి ప్రక్రియలను ఒకటికి రెండుసార్లు మార్గం ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని ఆమె తెలిపారు.

సైబర్ బ్యూరో సూచనలు

అనుమానాస్పద ఫైళ్లు లేదా అటాచ్మెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దని, వెబ్ వాట్సాప్పొ లాగిన్ అయిన పరికరాలను తరచూ పరి శీలించి, అవ సరం లేని వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలని శిఖా గోయల్ సూచించారు. సాధ్యమైనంత వరకు మల్టీ ఫ్యా క్టర్ అథెంటేషను వాడాలని, సంస్థల్లో అమలవుతున్న పటిష్టమైన ఆర్థిక విధానాలను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. ఇక బడా కంపెనీలు తమ ఉద్యోగు లకు క్రమం తప్పకుండా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని, ఈ విషయంలో సైబర్ నిపుణుల సేవలనువ వాడుకోవాలని ఆమె కోరారు. ఈ తరహా మోసాల నివారణకు ముందుగా అడ్డగోలు సందేశాలకు స్పందించవద్దని, అటాచ్మెంట్లను తెరవవద్దని, సం బంధిత వ్యక్తులతో నేరు గా సంప్రదించి అన్ని విషయాలను ధృవీకరించుకోవాలని కోరారు.

పసిబిడ్డను కత్తితో పొడిచిన థానే మహిళకు జీవిత ఖైదు.. పెద్ద కుమార్తెల సాక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha