Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త గ్యాస్ కనెక్షన్లు బంద్.. నగరంలో కష్టాలు

కొత్త గ్యాస్ కనెక్షన్లు బంద్.. నగరంలో కష్టాలు

వార్త 4 days ago

Hyderabad lpg gas:హైదరాబాద్ నగరంలో గ్యాస్ కనెక్షన్ పొందడం సామాన్యులకు పెద్ద సమస్యగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త ఎల్పీజీ కనెక్షన్లు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు రెండో సిలిండర్ తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

గత మూడు నెలలుగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల జారీ ఆగిపోవడంతో కొత్తగా కాపురం పెట్టినవారు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నేషనల్ కారణాల వల్ల అనుమతులు రాలేదని ఏజెన్సీలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

Read also: Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

 hyderabad lpg gas cylinders

కొండాపూర్ కేపీహెచ్ బీ ఉప్పల్ ప్రాంతాల్లో కష్టాలు

కొండాపూర్, కేపీహెచ్‌బీ, ఉప్పల్ ప్రాంతాలలో కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. గ్యాస్ కనెక్షన్ రాకపోవడంతో చాలామంది ఇండక్షన్ స్టవ్‌లు మరియు ఎలక్ట్రిక్ కుక్కర్లను వాడుతున్నారు. దీనివల్ల ఇళ్లల్లో కరెంట్ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోతోంది. ఒకే సిలిండర్ ఉన్నవారు అర్జెంట్ సమయాల్లో ఇబ్బంది పడకుండా డబుల్ సిలిండర్ కోసం అప్లై చేసుకుంటే డీలర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. సిలిండర్ అయిపోతే కొత్తది రావడానికి వారం రోజులకు పైగా పడుతుండటంతో గృహిణులు నానా తంటాలు పడుతున్నారు.

Hyderabad lpg gas:అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి

గ్రేటర్ పరిధిలో దాదాపు పదమూడు లక్షలకు పైగా కనెక్షన్లు మరియు రెండు వందలకు పైగా ఏజెన్సీలు ఉన్నప్పటికీ ఈ సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో తెలియక నగర ప్రజలు తీవ్రమైన గందరగోళంలో పడిపోయారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కొత్త కనెక్షన్లు మరియు డబుల్ సిలిండర్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలి. సామాన్యుల ఇబ్బందులను తొలగించి గ్యాస్ సరఫరాను సులభతరం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Epaper: epaper.vaartha.com

రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత హెచ్చరికలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha