America , Israel : వెస్ట్ ఆసియా దేశాలు పాకిస్థాన్లో మక్కాలో చేసుకున్న ఒడంబడిక ఒక విధంగా అమెరికా ఇజ్రాయి ల్ దేశాలకు అనుకూలంగా ఇరాన్ యుద్ధ నైపుణ్యాన్ని నియంత్రించటా నికి అమెరికా పన్నిన ఎత్తుగడా అని అంతర్జాతీయ విశ్లేషకులు సందేహిస్తు న్నారు!
ఒక్క పాకిస్థాన్ దేశానికే అణ్వాయుధాలు వున్నాయి! వెస్ట్ ఆసియాలోని సౌత్ అరేబియా టర్కీ దేశాలలో అమెరికా యుద్ధ స్థావరాల ను ఎన్నో సంవత్సరాల క్రింద ఏర్పరుచుకొని ప్రపంచదేశాల నాయకత్వాన్ని పదిలంగా ఉంచుకోటానికి నాటో సియస్ సంస్థలను స్థాపించి సోవియట్ రష్యా, చైనాలను అదువులో ఉంచేందుకు వేసిన ప్రణాళికలో భాగమని అందరికీతెలును! అప్పట్లో అలీన విధానాన్ని రూపొందించి ఇండియా ముస్లిం దేశాలతో మరికొన్ని దేశాలకు నాయకత్వం వహించి తటస్థం గా వుండటం ఎంత మంచిదో తర్వాత కాలాల వారికి తెలి సింది! యు.యన్.ఓ ఈ రాజకీయ సమీకరణకు కాస్తఊతం ఇచ్చినట్లయితే యు.యన్.ఓ స్థావనకు ఒక అర్ధమూ ప్రయో జనమూ సమకూరేది! దురదృష్టవశాత్తు అది జరగక పోవ టం వల్ల ప్రపంచ దేశాల మధ్య వచ్చే గొడవలకు ఎంపైర్ లేకుండా పోయినట్లయింది!
America , Israel
America , Israel : కొత్త ప్రణాళికకు తెరదీసిందా అన్న అనుమానం
యు.యన్. ఓ ఎంపైరింగ్బాబ్ వదిలేసి సైలెంట్ స్పెక్టేటర్’గా మారింది! అందువల్లే ఏ అంతర్జాతీయ సమస్య అయినా, సంఘర్షణలు ఐనా పరి ష్కారం లేకుండా ఏళ్ల తరబడి ఇబ్బందులను కలిగిస్తూనే ఉన్నాయి! ఆగస్టు 7న జరిగిన ఈ మక్కా ఒడంబడిక, ఒక విధంగా ఇరాన్ను నిలువరించే శక్తియుక్తులు క్రమేపీ కరిగి పోవటంతో, యు.యస్.ఏ ఈ కొత్త ప్రణాళికకు తెరదీసిందా అన్న అనుమానం సామాన్యులకు గూడా కలుగుతున్న ది! ఈ మూడు దేశాలు ‘s యింట్ సెక్యూరిటీ’ పేరుతో చేసుకున్న ఈ అగ్రిమెంట్ ఈ మూడు దేశాలలోని ఏ ఒక్క దేశంపై మరో దేశం దాడిచేయ ప్రయత్నించినా మిగతా రెండు దేశాలు తమ దేశాల మీద దాడిగానే భావించి సమిష్టి రక్షణలో భాగంగా దాడిచేసిన దేశం కానీ దేశాలను కాని, నిలవరించి, దాడులను త్రిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపేందుకే ఈ ‘ఒడంబడిక’ పనికి వస్తుంది! నాటో అంతరించిన నేపథ్యంలో ఈ సమిష్టి రక్షణ ఒడం బడికలు ఎంతవరకు ఉపయోగపడ్తాయో అప్పుడే చెప్పటం కష్టం కానీ అణ్వాయుధాలతో డ్రోన్లతో నవ్యతతో కూడు కున్న సాంకేతిక పరిజ్ఞానంతో అన్నిటినీ మించి ప్రస్తుతం వరంగా వెలిసిన ‘కృత్రిమ మేధ’ (ఎ.ఐ) ఆయుధంతో, ఇలాంటి రక్షణ ఒడంబడికలు నామమాత్రంగానే మిగులుతా యేమో! పాకిస్థాన్ ఇండియాతో వున్న పరిస్థితులను ఎదు ర్కోటానికి, పి.ఒ.కే (పాకిస్థాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్)ను నియంత్రించటానికి, బెలూచిస్థాన్ రెబెలియన్ తట్టుకోలేక ఈ ఒడంబడికకు సిద్ధపడిందా అన్న అనుమానం కూడా యుద్ధ నిపుణులకు కలుగుతున్నది!
ఇరాన్తో వున్న సంబంధం పూర్తి గా తెగినట్లయింది!
నిన్న మొన్నటిదాకా. అమెరికా సందిట చేరి, ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య మధ్యవర్తి త్వం నెరిపిన పాకిస్థాన్, అమెరికా, ఇరాన్ను పూర్తిస్థాయిలో ఎదుర్కోలేని దశలో, ఈ కొత్త పాచికకు తెరతీసినట్లుంది! హార్ముజ్ జలసంధి ద్వారా తమకు సంబంధించిన చమురు నౌకలను క్షేమంగా తమ తీరాలకు చేరాలనుకున్న పాకిస్థాన్ కు ఇరాన్ స్పష్టంగా పాక్ నౌకలను అనుమతించమని తేల్చి చెప్పటంతో విధిలేని పరిస్థితులలో ఈనిర్ణయం తీసుకోవల్సి వచ్చినట్లుంది! ఇరాన్, పాక్ దేశాల మధ్య షియా, సున్నీ మతపరమైన గొడవలు అనాది నుంచీ వున్నాయి! పైపైన కనపర్చిన స్నేహ సంబంధాలు ఈమధ్య కాలంలో ఏర్పడిన మార్పుల వల్ల బహిరంగంగా వదులుకోక తప్పటం లేదు! ఇండియా, చైనా దేశాలకు ఇరాన్ ఆయిల్ షిప్లు అనుమతి స్తున్నట్లు ప్రకటించటంతో ఇరాన్తో వున్న సంబంధం పూర్తి గా తెగినట్లయింది! అమెరికా వెస్ట్ ఏషియా ఇజ్రాయిల్ దేశాల సమిష్టి బలాలకు ధీటుగా ఇండియా, రష్యా చైనా తమ స్నేహ సంబంధాలను మరింతగా మెరుగుపర్చుకున్నా ఆశ్చ ర్యపడాల్సిన అవసరం లేదు. బహుశా రానున్న కాలంలో అదే జరగొచ్చు! మాటిమాటికి ట్రంప్ ఉపయోగిస్తున్న ‘శాంక్షన్స్’ ఆయుధం వాడితగ్గిపోయింది!
డాలర్ను బలహీనపర్చేం దుకు
ఈమూడు దేశాలు అమెరికా డాలర్ విలువను తగ్గించటానికి తమ కరెన్సీ తమ తమ దేశాలలో చెల్లేట్లు చేసుకొని డాలర్ను బలహీనపర్చేం దుకు చేసిన ఆలోచన ఇతర దేశాలు ముఖ్యంగా యూరోపి యన్ స్కాండినేవియన్ దేశాలను కూడా కలవరపరుస్తున్న ది! ఫ్రాన్స్, అమెరికా దేశాలు దూరమవుతున్న సంకేతాలు ఈ మధ్య ఇరు దేశాల నేతల మధ్య జరిగిన గొడవ స్పష్ట పరుస్తున్నది! ఇదివరకు జరిగిన అంతర్జాతీయ ఒడం బడికలు రెండు బలమైన దేశాలు అమెరికా, రష్యాల నాయకత్వాన్ని ప్రోత్సహించేం దుకు. బలపర్చేందుకు ఏర్పడినవే! ఇప్పుడు కాలం మారింది! ప్రాంతీయంగా బలంగా వున్న దేశాలు, తమ తమ బలాలను పెద్ద దేశాలకు ధీటుగా తమ స్వీయ రక్షణకు ఏర్పరుచుకొనేందుకు సిద్ధంగా వున్నట్లు ఈ ‘మక్కా ఒడంబడిక బహిర్గత పరుస్తున్న మాట నిజం! అమెరికా దేశంలో అన్ని రకాల ఆయుధాలు ఈ మధ్య ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఉపయోగించటం వల్ల వాటి నిలవల సంఖ్య బాగా తగ్గిపోయి ఆయుధాలు ఉ త్పత్తి చేసే కార్మా గారాలు, కొత్త సామాగ్రిని అందుబాటులో ఉంచితేనే ఇజ్రా యిల్కు మరింత వత్తాను పలికే అవకాశం ఉంది. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకోమాట చెప్తూ చర్చలు సాగుతున్నా యనే అభిప్రాయం కలగచేసే పనిలో ఉన్నారు. అది ఒక విధంగా అమెరికా బలహీనతను ప్రతిబింబిస్తున్నది. నిజానికి ఈ డిఫెన్స్ డీల్ దాదాపు నెల క్రితమే డీల్ మీద సంతకం చేసిన దేశాలు భయంతో ఉండటంతో హడావిడిగా ఈ డీల్ కుదుర్చుకున్నారు. ఇరాన్ మీద దాడి ఇంకా ఒక పరిష్కారా నికి రాకపోవటం వెస్ట్ ఏషియా దేశాలకు పెద్ద దెబ్బే!
America , Israel ఒడంబడికల కాలం ఇంకా చెల్లుబాటు
అన్ని అరబ్ గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల వల్ల ఒత్తిడిని ఎదుర్కో లేని స్థితిలో ఉన్నాయి. ఇరాన్తో సంబంధం ఉన్న హౌతీస్ (అన్పరస (అల్లా) గత నెలలో సౌదీ ఆయిల్ వనరుల మీద దాడి చేసి రెడ్ సీపోర్టుల మీద బ్లాకేడ్ విధించటం వల్ల కోలుకోలేని దెబ్బకు ఈ దేశాలు గురి అయ్యాయి. ఆయిల్ సరఫరా అగిపోయే స్థితి వచ్చింది. ఈ డీల్ వల్ల సౌదీ అరేబియాకు రక్షణ కలిగే అవకాశం లేదని ఇరాన్ అధికార ప్రతినిధి బాహాటంగా చెప్పటం ప్రస్తుతం అమెరికా వత్తాను పలుకుతున్న వెస్ట్ ఏషియా దేశాలు ఎంతటి క్లిష్టస్థితిలో ఉన్నాయో చెప్పకనే చెప్పినట్లయింది. పాకిస్థాన్ ఈ డీల్లో ఉండటం వల్ల ఒడంబడిక నమ్మశక్యంగా కనపడటం లేదు. ఎందుకంటే సెక్యూరిటీ పార్టనర్గా మక్కా డీల్లో సంతకం చేసి మీడియేటర్గా ఇరాన్ యుద్ధంలో ఉండటం వల్ల ఈ ఒడంబడిక ఒక కొలిక్కి వచ్చేట్లు లేదని విదేశాంగ విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఏ ఒడంబడిక అయినా సంఘర్షణలు ప్రారంభమయితే ఆపలేదన్నది చరిత్ర చెప్పకనే చెబు తున్నది. కేవలం ఇలాంటి ఒడంబడికలు మేమూ యుద్ధానికి ‘సై’ అంటున్నాం అని గంభీరంగా సంకేతాలు ఇవ్వటా నికే పనికివస్తాయి! ప్రస్తుత కాలంలో ఒడంబడికలు కుదరట మనేది మేలు చేకూరుస్తుందని ఏ దేశమూ నమ్మే పరిస్థితి లో లేదు!కాలమే ఈ ఒడంబడికల కాలం ఇంకా చెల్లుబాటు అవుతుందా అన్న సందేహాన్ని తీర్చగలదు. కృత్రిమ మేథ తెర మీదికి వచ్చిన నేపథ్యంలో సాంప్రదాయ రీతుల్లో యుద్ధాలను కొనసాగించే స్థితి కనుమరగవుతున్నది. ప్రస్తుతం వున్న సంఘర్షణల్లోంచి ఇలాంటి రక్షణపరమైన ఒడంబడి కలు మరిన్ని పుట్టుకొని వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు! ఇజ్రాయిల్ అమెరికా, మొదట్లో గోటితో పోతుందను కున్న సమస్య గొడ్డలిదాకా రావటం అందర్నీ ఆశ్చర్యపరు స్తునే వుంది! అయితే సాంకేతికంగా వృద్ధి పొందుతూ ఎ.ఐ ని అనుకూలంగా ఉపయోగించు కోనేందుకు సిద్ధపడుతున్న దేశాలు ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీసే విధంగా ప్రవర్తిస్తాయో వేచి చూడాల్సిందే!
-రావులపాటి సీతారాంరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

