Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త పార్టీపై కీలక ప్రకటన

కొత్త పార్టీపై కీలక ప్రకటన

వార్త 1 month ago

Vijay Sai Reddy: రాజ్యసభ ఎంపీ పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ పునరాగమనంపై (Political Re-entry) స్పష్టత ఇచ్చారు.

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.

Read Also :Virupakshi: వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఊరట: ఒక కేసులో బెయిల్ మంజూరు

తిరుమల పర్యటన & కీలక వ్యాఖ్యలు

బుధవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమస్యలను, వారి గొంతుకను బలంగా వినిపించేందుకే నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో ప్రభావం తగ్గి, విస్తారంగా వర్షాలు కురిసి రైతాంగం సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు.

Vijay Sai Reddy: సోషల్ మీడియాలో పార్టీ పేరుపై ప్రచారం

విజయసాయిరెడ్డి రీ-ఎంట్రీ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు 'భారత్ జన వికాస్' అంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని మీడియా కథనాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పార్టీ పేరుపై విజయసాయిరెడ్డి వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే పార్టీ పేరు, జెండా, మరియు ఎజెండాను వెల్లడించే అవకాశం ఉంది.

ఏపీలో ఇక షూటింగ్స్ ఫ్రీ.. మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha