Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త ఉద్యోగులకు 15 వేల కానుక

కొత్త ఉద్యోగులకు 15 వేల కానుక

వార్త 3 days ago

New employee benefits:కేంద్ర ప్రభుత్వం దేశంలో మొదటిసారి కొలువులో చేరే యువత కోసం ప్రధానమంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా అద్భుతమైన అవకాశం అందుబాటులోకి తెచ్చింది.

ఈ పథకం కింద అర్హులైన కొత్త ఉద్యోగులు గరిష్టంగా రూ.15,000 నగదు ప్రోత్సాహకం పొందే వెసులుబాటు ఉంది. ఉద్యోగాల్లో చేరుతున్న యువతను ఆర్థికంగా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

APPSC Notification: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు

 PM Viksit Bharat Rozgar Yojana

ఈ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో ఎలా డిపాజిట్ అవుతుంది?

ఈ ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో విడతల వారీగా జమ అవుతుంది. మొదటి విడత ఆరు నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత డిపాజిట్ చేస్తారు. మిగిలిన బకాయి మొత్తం 12 నెలల సర్వీస్ నిండిన అనంతరం అర్హత ఆధారంగా జమ చేస్తారు.

New employee benefits:పథకం లబ్ధి పొందేందుకు మీలో ఉండాల్సిన సీక్రెట్ అర్హతలు

ఈ పథకం ప్రయోజనం పొందేందుకు ఉద్యోగి ఈపీఎఫ్‌ఓ పరిధిలోని సంస్థలో చేరి ఉండాలి. ప్రతినెలా పొందే వేతనం రూ.1 లక్ష లోపు ఉండటం తప్పనిసరి. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్, యూఏఎన్ నమోదు పూర్తి చేసి, బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

Epaper: epaper.vaartha.com

స్టూడెంట్స్ కోసం AICTE గోల్డెన్ ఆఫర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha