May Day 2026: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో మే డే పురస్కరించుకొని శుక్రవారం నాడు కౌడిపల్లి గ్రామంలోని భవన నిర్మాణ కార్మికుల కార్యాలయం వద్ద సిఐటియు జెండాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ గానం చేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు అలాగే పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు గ్రామ ఉప సర్పంచ్ చేతుల మీదుగా మే డే జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు మండల కేంద్ర కార్యాలయంలో సముదాల ఎదుట అంగన్వాడి కార్యకర్తలు సిఐటియు జెండా ఎగరేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చని అన్నావు కార్మికులు పోరాట ఫలితమే ఎనిమిది గంటల పని దినాలు వచ్చిందని ఆమె గుర్తు చేశారు సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేయడానికి సిఐటియు కార్మికులకు అండగా ఉంటుందని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమం(May Day 2026)లో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గౌడిచర్ల ప్రశాంత్ గౌరవాధ్యక్షులు వెంకటేశ్వర్ రావు మాజీ అధ్యక్షులు జావిద్ విశ్రాంతి ఉద్యోగ సంఘాల నాయకులు పుండరీకం గౌడ్ గ్రామ ఉప సర్పంచ్ శ్వేతా మల్లికార్జున గౌడ్ సభ్యులు దేవేందర్ కుమార్ మక్బుల్ రమేష్ నాయకులు రాగుల భూమయ్య పటేల్ చంద్రం కిషోర్ గౌడ్ హరి ఓం సెంట్రింగ్ శ్రీనివాస్ గౌడ్ చర్ల నరేందర్ లతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

