Kaudipally news:సంక్షేమ భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయరామరావు మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సంక్షేమ భవనాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయరామరావు పేర్కొన్నారు.
గురువారం నాడు ఆయన కౌడిపల్లి గ్రామ పంచాయతీకీ సంబంధించి నిర్మాణంలో ఉన్న మహిళా సమాఖ్య భవనం పనులను, అలాగే త్వరలో నిర్మాణం చేపట్టనున్న మహిళా సమాఖ్య భవనం-2 మరియు అంగన్‌వాడీ భవనాల నిర్మాణ స్థలాలను జగిత్యాల, మెదక్ జిల్లాల ప్రత్యేక అధికారి శ్రీ విజయరావు గారు సందర్శించి పరిశీలించారు.
Visit to the Kowdipally MPDO office
Read also: Hyderabad power cut: అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో కరెంటు ఉండదు!
Kaudipally news:సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి పరిశీలన
ముందుగా కార్యాలయంలోని మండల అభివృద్ధికి సంబంధించిన పనులకు బిల్లుల చెల్లింపులపై రికార్డు పరిశీలించి క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పంచాయతీ నిధులకు సంబంధించి దేవులపల్లి, రాయలపూర్ గ్రామంలో స్వయంగా పరిశీలించారు. దేవులపల్లి గ్రామంలో ఇందిర మహిళ నిర్మాణం తడి చెత్త పోటీ చెత్త వేరు చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి సురేష్బాబు, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి రామ రావు (ఎంపీఓ) మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Visit to the Kowdipally MPDO office
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

