Dailyhunt
కొవిడ్ వ్యాక్సిన్‌పై మస్క్ షాకింగ్ పోస్ట్!

కొవిడ్ వ్యాక్సిన్‌పై మస్క్ షాకింగ్ పోస్ట్!

వార్త 1 week ago

Elon Musk: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కొవిడ్ వ్యాక్సిన్‌పై చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఫైజర్ కంపెనీకి చెందిన కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న సమయంలో తాను ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు.

“రెండో డోసు నన్ను చంపేసినంత పనిచేసింది. ఆ సమయంలో ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను” అని మస్క్ వ్యాఖ్యానించారు. జర్మనీ పార్లమెంట్‌లో ఒక మాజీ సైంటిస్ట్ చేసిన ఆరోపణల వీడియోను రీ-పోస్ట్ చేస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read Also:Trump Tower : చందమామపై 'ట్రంప్ టవర్'..సోషల్ మీడియా లో ట్రంప్ పోస్ట్

Elon Musk: జర్మనీ పార్లమెంట్‌లో మాజీ సైంటిస్ట్ ఆరోపణలు

ఫైజర్ కంపెనీలో టాక్సికాలజీ విభాగాధిపతిగా పనిచేసిన డాక్టర్ హెల్మట్ స్టెర్జ్, మార్చి 19న జర్మనీ పార్లమెంటరీ కమిషన్ ముందు కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు.ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్‌ను ఆమోదించే ముందు క్యాన్సర్ కారక పరీక్షలు (Carcinogenicity), పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం వంటి కీలక పరీక్షలు నిర్వహించలేదని ఆయన ఆరోపించారు.జర్మనీలో అధికారికంగా 2,133 వ్యాక్సిన్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని, అయితే వాస్తవ మరణాలు దీనికి 30 రెట్లు ఎక్కువగా (సుమారు 60,000) ఉండి ఉండవచ్చని స్టెర్జ్ అంచనా వేశారు.ఈ ఆరోపణలను జర్మనీ ఆరోగ్య మంత్రి కార్ల్ లాటర్‌బాచ్ వెంటనే ఖండించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha