Covid : కొవిడ్ వచ్చేసిందనో, వచ్చేస్తోందనే భయపడదామా? ముందు జాగ్రత్తలతో అప్రమత్తమవుదామా? అంటే ఎంతో మంది రెండో దానికే ప్రాధాన్యత నిస్తారు. కానీ తెలిసీ తెలియని పరిస్థితుల్లో మరెంతో మంది అంతర్లీ నంగా భయపడి వణికిపోతుంటారు.
ఏదిఏమైనా ‘కోవిడ్’ భూతం మళ్లీ నేరుగానో మరో రూపంలోనో మానవాళి మధ్యన చేరినట్లే ఉంది. దేశ వ్యాప్తంగా దాదాపు 500 కేసులకిపైగా కోవిడ్ పాజిటివ్ వచ్చినా అక్కడక్కడ ఆ లక్షణాలున్న రోగాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దాదాపు కోవిడ్ రోగ లక్షణాలకు దగ్గరగా ఉన్నా కొన్ని లక్షణాలు రోగులను భయభ్రాంతుల్ని చేస్తున్న సమాచారం విస్తృతంగా ఉంది. అలా అని కరోనా వ్యాప్తి జరగదని కానీ, జరుగలేదనీ కానీ ధృవీ కరించే సమాచారమేదీ అందుబాటులో లేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరీక్షలు చేసినప్పుడు కొంత మందికి పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. నెల్లూరు ఎన్టీఆర్ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడంతో ఆ ప్రాంతంలో కొంత అలజడి బయలుదేరింది. మళ్ళీ మాస్క్ దుమ్ము దులుపుతున్నారు.
Covid
Covid : వ్యాధి నిరోధక శక్తి తగ్గి
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల నిడిగుంట పాలెంకు చెందిన మూడేళ్ల బాలుడు కేన్సర్ చికిత్స కోసం పుదుచ్చేరి వెళ్లగా అక్కడ కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. అతని బంధువులందరికీ నెగి టివ్ అని తేలడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీ ఆర్ ‘జిల్లా తిరువూరు మండలం రోలపాడు నివాసం 13 ఏళ్ల బాలిక ‘కిడ్నీ’ వ్యాధితో విజయవాడ ప్రభుత్వ ఆస్ప త్రిలో చేరగా ఆమెకూ ‘కోవిడ్ పాజిటివ్’ ధృవీకరణతో ఆ రాష్ట్రమంతా అప్రమత్తమైంది. సాధారణ వ్యక్తులెవరికీ ‘కోవిడ్’ పాజిటివ్ రాకపోవడం మంచిదైంది. లేకుంటే సాధారణ జనంలో అనవసరంపు ఆందో ళనలు మొదల య్యేవి. ఆంధ్ర రాష్ట్రంలో జూన్ 26 నుంచి జులై 19 మధ్యకాలంలో 19 కోవిడ్ కేసులు చికిత్సలో ఉండగా నాలుగు మరణాలు నమోదయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి లక్షణాలున్న ఒక్క కేసుకూడా నమో దవలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించినా హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారెవరికీ పాజిటివ్ రాలేదు. తీవ్రమైన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారే వ్యాధి నిరోధక శక్తి తగ్గి కోవిడ్ బారినపడ్డారు. ఈ కారణాల చేత మరో రోవిడ్ ‘వేవ్’వచ్చిందనే ఆరోపణలను వైద్యులు కొట్టి పారే స్తున్నారు. అయితే వర్షాకాలం రీత్యా జ్వరాలు, ఫ్లూ, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య లక్షణాలపై ఆస్పత్రులకు వెళ్తున్నారు.
కోవిడ్ వైరస్లో స్వల్ప మ్యూటేషన్ల కారణం
తొలి దశలోనే వ్యాధినిరోధకత చికిత్స తీసుకోవడం మంచిది. కోవిడ్ వైరస్లో స్వల్ప మ్యూటేషన్ల కారణంగా క్లస్టర్లుగా మాత్రమే కోవిడ్ వ్యాప్తిని గుర్తిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ కేసుల విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ఒమిక్రాన్ సబ్వేరియంట్పై నిర్ధారణ జరిగాకనే వైద్యాధికారులు వాటి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. మహారాష్ట్ర, కేరళ, గుజ రాత్, ఆంధ్రప్రదేశ్లోనూ కోవిడ్ కేసులు పెరగడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కానీ ప్రజల్లో కోవిడ్ నాలుగో వేవ్ను చూడబోతున్నామా? అనే ఆందోళనతో ఉన్నారు. ఆదేంకాదు కానీ కేవలం సా డే టర్ట్ ట్రాన్స్ మిషన్గా శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర లో 48కేసులు ఆంధ్రప్రదేశ్లో 12 కేసులున్నాయి. చాలా కేసులు ఇతర వ్యాధులకు టెస్ట్ చేస్తున్న సందర్భాల్లో బయటపడినవే. ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రు లన్నీ ఏ రుగ్మతకు శస్త్రచికిత్స చేయాల్సినా ఆ సందర్భం లోనూ ‘కోవిడ్ టెస్ట్ తప్పనిసరి చేస్తున్నారు. అలాబయట పడినవే ఈ కొన్నీ కూడా. కోవిడ్కు పునఃప్రవేశం లేదని చెప్తున్న శాస్త్రజ్ఞులు సైతం వాటి నుంచి వచ్చిన కొత్త వేరి యంట్లకు అవే లక్షణాలున్నా కరోనా వైరస్ఆంతప్రమా దం కాదని చెబుతున్నారు. ఈ మాట కోవిడ్ రోగులకు వర ప్రసాదంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 73 దేశాల్లో పాజిటివిటీ రేటు 11శాతా నికి చేరినట్లు లెక్క ఇప్పటికీ ఆలస్యం లేదు. జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు. సాధారణ జ్వరాలే అయినా చికిత్సకు వెళ్లాలి.
Covid
‘మాస్క్’ ధరించడం అలవాటు చేసుకోవాలి
వృద్ధులు దయాబిటిస్, బి.పి, గుండె జబ్బులున్నవారు ‘మాస్క్’ ధరించడం అలవాటు చేసుకో వాలి. సర్వైలెన్స్, జీనోమ్ సీక్వెన్సింగ్ను కొనసాగించా ల్సిన బాధ్యత ప్రభుత్వంమీద ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను సిద్ధంగా ఉంచుకో వాలి. మాస్క్, శానిటైజర్, టెస్ట్ అత్యవ నరం. కోవిడ్తో కలిసి బతకడం ఇంత క్రితమే అలవాట యింది. కనుక అదేదారిలో ఈసారి కూడా వైద్యచికిత్స లు, సామాజిక జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో కోవిడ్ బాధితులకు తర్వాత క్రమంలో డెంగీ లక్షణాలు వస్తుం టాయని కూడా కొన్ని అధ్యయనాలున్నాయి. ఈకారణం చేత డెంగీ వ్యాధిసోకిగా నాలుగు రోజులకు తగ్గిపోతుంది లే! అని ఆశ్రద్ద చేసేందుకు వీలులేదు. దేశంలో డెంగీ వ్యాధి నివారణకు ‘క్యూడెంగా’ అనే కొత్త టీకా త్వరలో భారత్లో విడుదల కాబోతోంది. జపాన్కు చెందిన తకేడా బయోఫార్మస్యూటికల్స్ సేవలు అభినందించాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసుల్లో మూడోవంతు భారత్ లోనే నమోదవుతున్నందున భారతీయులకీ టీకా వర ప్రసాదమే. మనదేశంలో ఆమోదం పొందిన తొలి డెంగీ టీకాను స్వాగతిద్దాం. ఒక్కోసారి పుట్టిన వైరస్ మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉన్నందున వ్యాధి నివారణ కన్నా వ్యాధి నిరోధకత మేలు, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాలలో విస్తృతంగా ఉన్న ఒమిక్రాన్ ఆర్ఎఫ్ 5 వేరియంట్ కోవిడ్ వైరస్ భారత్లోకి ఎలా ప్రవేశించిందో భారత్ పరిశీలించి చర్యలు తీసుకోవాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
ఒక్కరోజే 21 మంది మృతి.. 16 జిల్లాల్లో 5.6 లక్షల మందిపై ప్రభావం!

