Credit Card : సమకాలీన ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే, ఇటీవల చాలా మంది అత్యవసర సమయాల్లో లేదా నగదు కొరత ఏర్పడినప్పుడు క్రెడిట్ కార్డులను నేరుగా ఏటీఎం (ATM) మిషన్లలో ఉంచి డబ్బును విత్‌డ్రా (Cash Advance) చేసుకుంటున్నారు.
సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ లేదా స్వైపింగ్ లావాదేవీలు చేసినప్పుడు బ్యాంకు మనకు 45 నుండి 50 రోజుల పాటు ఎలాంటి వడ్డీ లేని కాలపరిమితిని (Grace Period) ఇస్తుంది. కానీ, చాలా మందికి తెలియని పచ్చి నిజం ఏంటంటే.. క్రెడిట్ కార్డును ఏటీఎంలో ఉపయోగించి నగదు విత్‌డ్రా చేసిన మరుక్షణమే ఈ గ్రేస్ పీరియడ్ సదుపాయం పూర్తిగా రద్దవుతుంది. మీరు ఏటీఎం నుంచి డబ్బు తీసిన మొదటి రోజు నుంచే బ్యాంకులు వడ్డీని లెక్కించడం (Interest Accumulation) ప్రారంభిస్తాయి. దీనివల్ల కాలీ జేబుతో ఉన్న వినియోగదారుడు తెలియకుండానే పెద్ద ఆర్థిక ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
Read Also : రూ. 1 కే 'పారాచూట్ అడ్వాన్స్‌డ్ ప్రోటీన్ షాంపూ' విడుదల!
Credit card33% పైగా భారీ వడ్డీల బాదుడు – ప్రాసెసింగ్ ఫీజుల తలపోటు
క్రెడిట్ కార్డు క్యాష్ విత్‌డ్రా పై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు సాధారణ వ్యక్తిగత రుణాల (Personal Loans) కంటే ఊహించని స్థాయిలో చాలా ఎక్కువగా ఉంటాయి. బ్యాంకులు వార్షికంగా కనీసం 33% నుండి 45% వరకు అత్యధిక వడ్డీని చక్రవడ్డీ రూపంలో వసూలు చేస్తాయి. ఇదిలా ఉంటే, కేవలం వడ్డీ మాత్రమే కాకుండా ‘క్యాష్ అడ్వాన్స్ ఫీజ్’ (Cash Advance Fee) పేరిట ప్రతి విత్‌డ్రాపై కనీసం రూ. 250 నుండి రూ. 500 వరకు లేదా విత్‌డ్రా చేసిన మొత్తంలో 2.5% నుండి 3% వరకు ప్రాసెసింగ్ ఫీజును అదనంగా బాదుతాయి. దీనికి తోడు ఈ సేవలన్నింటిపై 18% జీఎస్టీ (GST) అదనం. కేవలం కొన్ని వేల రూపాయల నగదు కోసం క్రెడిట్ కార్డుపై ఆధారపడితే, వచ్చే నెల బిల్లు చూసేసరికి ఆ మొత్తం భారంగా మారుతుంది. అందుకే, ప్రాణాపాయ లేదా అత్యంత అనివార్యమైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంల నుండి డబ్బులు తీసే జోలికి అస్సలు వెళ్లకూడదని ఆర్థిక నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 'ఏఎం/ఎన్ఎస్ ఇండియా' అరుదైన రికార్డు!

