Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేయనున్న 15 ఏళ్ల కుర్రాడు..

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేయనున్న 15 ఏళ్ల కుర్రాడు..

వార్త 5 days ago

IPL 2026 sixes : ఐపీఎల్ 2026 సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా లెజెండ్ అనిల్ కుంబ్లే ప్రశంసల జల్లు కురిపించారు.

విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేసే సత్తా ఈ టీనేజ్ క్రికెటర్‌కు ఉందని ఆయన జోస్యం చెప్పారు.

గేల్ రికార్డుకు అడుగు దూరంలో..

ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధికంగా 59 సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. కాగా, నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదడం ద్వారా వైభవ్ ఈ సీజన్‌లో తన మొత్తం సిక్సర్ల సంఖ్యను ఇప్పటికే 53కి చేర్చాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉందని, ఒకవేళ ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే మాత్రం క్రిస్ గేల్ రికార్డును వైభవ్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని కుంబ్లే అభిప్రాయపడ్డారు.

Read also : India vs Afghanistan 2026:ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు జట్లను ప్రకటించిన BCCI

 IPL 2026 sixes

ప్రత్యేకమైన ట్యాలెంట్.. అద్భుతమైన మైండ్ సెట్

మైదానంలో వైభవ్ బ్యాటింగ్ శైలి, ముఖ్యంగా దిగ్వేశ్ రాథీ బౌలింగ్‌లో కవర్ మీదుగా అతను అత్యంత సులువుగా కొట్టిన సిక్సర్లను చూసి ముగ్ధుడనయ్యానని కుంబ్లే కొనియాడారు. కేవలం ఆటలోనే కాకుండా వైభవ్ మైండ్ సెట్ కూడా చాలా భిన్నంగా ఉందన్న ఆయన.. ఈ చిన్న వయసులోనే పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రతీసారి ఎంతో పరిపక్వతతో, అణకువతో మాట్లాడుతున్నాడని అభినందించారు. ఈ లక్షణాలన్నీ వైభవ్ సూర్యవంశీ క్రికెట్‌లో చాలా సుదీర్ఘమైన, అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోబోతున్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అనిల్ కుంబ్లే విశ్లేషించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లఖ్‌నవూపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha