Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కృష్ణాష్టమి పూజ అర్ధరాత్రే ఎందుకు చేయాలి?

కృష్ణాష్టమి పూజ అర్ధరాత్రే ఎందుకు చేయాలి?

వార్త 2 weeks ago

Krishnashtami 2026: గత కొంతకాలంగా హిందూ పండుగల తిథులు రెండు రోజుల పాటు వస్తుండటంతో భక్తుల్లో తరచుగా గందరగోళం నెలకొంటోంది. ఇలాంటి సమయాల్లో పంచాంగ కర్తలు, సిద్ధాంతులు తెలిపిన నిర్ణయాలను అనుసరించడం శ్రేయస్కరం.

ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి (కృష్ణాష్టమి) తేదీ విషయంలోనూ భక్తులలో సెప్టెంబర్ 4న లేదా సెప్టెంబర్ 5న జరుపుకోవాలా అనే సందేహం నెలకొంది. శాస్త్రం మరియు పంచాంగ ప్రకారం 2026 సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున కృష్ణాష్టమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యే ఈ పవిత్ర తిథి సెప్టెంబర్ 5 తెల్లవారుజాము వరకు ఉంటుంది.

Read Also :Sri Krishna Janmashtami: నేడే కృష్ణాష్టమి.. పూజకు శుభ ముహూర్తం ఇదే!

Krishnashtami 2026: అర్ధరాత్రి పూజా ముహూర్తం & కృష్ణాష్టమి విశిష్టత

పంచాంగం ప్రకారం పూజా ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఉంటుంది. భక్తులకు స్వామివారి అర్ధరాత్రి పూజను నిర్వర్తించుకోవడానికి దాదాపు 45 నిమిషాల వ్యవధి లభిస్తుంది. పురాణాల ప్రకారం, శ్రావణ మాసంలో అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ భగవానుడు మధ్యరాత్రి (అర్ధరాత్రి) జన్మించాడు. లోకాన్ని అధర్మం నుంచి కాపాడేందుకు శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారంగా కృష్ణుడిగా ఉద్భవించిన ఆ సమయం అత్యంత పవిత్రమైనది. శ్రీకృష్ణుడు జన్మించిన ఆ దివ్య క్షణాన్ని పురస్కరించుకుని భక్తులు రాత్రి సమయం వరకు ఉపవాసం ఉండి, అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి నైవేద్యాలు సమర్పించి ఉట్టి కొట్టడం (ఉట్లోత్సవం) వంటి సంప్రదాయ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు.

కృష్ణాష్టమి రోజు ఈ పూలతో పూజిస్తే అదృష్టం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha