Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్షమాపణలు కోరిన రణబీర్

క్షమాపణలు కోరిన రణబీర్

వార్త 2 days ago

Ranabir : బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకల ప్రచార కార్యక్రమం సందర్భంలో సంభాషిస్తూ, "చెడు ఎంత బలమైనదైనా సరే, చివరికి నిజం మరియు మంచే అంతమవుతాయి (నశిస్తాయి)" అంటూ నోరుజారారు.

ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన రణబీర్ కపూర్, చెన్నైలో జరిగిన ‘రామాయణ’ (Ramayana) చిత్ర ఆడియో ఆవిష్కరణ మరియు ప్రమోషన్స్ కార్యక్రమంలో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. పొరపాటున నోరు జారడం వల్లే ఆ పదం దొర్లిందని, దయచేసి తనను క్షమించాలని కోరారు.

“మంచే గెలుస్తుంది”: వివాదానికి చెక్ పెట్టిన బాలీవుడ్ హీరో

వాస్తవానికి తన ఉద్దేశం “చెడు ఎంత శక్తివంతమైనదైనా సరే, ఆఖరికి నిజం మరియు మంచే విజయం సాధిస్తాయి” అని చెప్పడమేనని రణబీర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన ‘రాక్‌స్టార్’ చిత్రంలోని “జో భీ మై కెహనా చాహూన్, బార్బాద్ కరే అల్ఫాజ్ మేరే” (నేను ఏమి చెప్పాలనుకున్నానో, నా మాటలే దాన్ని పాడుచేస్తున్నాయి) అనే పాటను గుర్తుచేసుకుంటూ, మాటల ప్రయోగంలో దొర్లిన పొరపాటుపై విచారం వ్యక్తం చేశారు. రాముడి పాత్రలో రణబీర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక ‘రామాయణ’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, ఈ వివాదానికి సకాలంలో క్షమాపణ చెప్పి చెక్ పెట్టడం పట్ల అభిమానులు మరియు నెటిజన్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వారసులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను: సూపర్ స్టార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha