Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR :కుటుంబంలో భేదాభిప్రాయాలు సహజమే!

KTR :కుటుంబంలో భేదాభిప్రాయాలు సహజమే!

వార్త 5 months ago

కుటుంబం అంటే సమస్యలు, అభిప్రాయ భేదాలు సహజమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. చిన్నచిన్న మనస్పర్థలు లేకపోతే అది నిజమైన కుటుంబమే కాదని ఆయన అన్నారు.

ఒక ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటేనే సాయంత్రం వంట విషయంలో కూడా వేర్వేరు అభిప్రాయాలు వస్తాయని, అలాంటివి సాధారణ విషయాలేనని చెప్పారు.

Read also: CM Revanth : కెసిఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది - కేటీఆర్

కుటుంబంలో చిన్నపాటి పంచాయితీలు జరుగుతూనే ఉంటాయని, కానీ అవన్నీ ఇంటి గడప దాటకుండా లోపలే పరిష్కరించుకుని, తర్వాత మళ్లీ ఐక్యంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలకూ వర్తింపజేయాలన్నారు. జనగామ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఒక్కరికే పోటీ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ ఖరారయ్యే వరకు మాత్రమే అసంతృప్తులు ఉండవచ్చని, కానీ బీఫామ్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉందని, టికెట్ ఇచ్చిన తర్వాత కూడా అంతర్గత అసంతృప్తులు కొనసాగితే కాంగ్రెస్, బీజేపీలకు పార్టీని విమర్శించే అవకాశం కల్పించినట్టవుతుందని కేటీఆర్(KTR) హెచ్చరించారు. పార్టీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని బీఫామ్ కేటాయిస్తుందని, ఎవరికి టికెట్ వచ్చినా కారు గుర్తుపై ఉన్న అభ్యర్థిని కేసీఆర్‌గా భావించి ఓటు వేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఇటీవల కవిత పార్టీపై విమర్శలు చేస్తూ కొత్త పార్టీ ఏర్పాటు గురించి వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha