Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుకీ దొంగిలించాడని 11 ఏళ్ల ఉద్యోగిని తీసేసిన ఫోర్డ్

కుకీ దొంగిలించాడని 11 ఏళ్ల ఉద్యోగిని తీసేసిన ఫోర్డ్

వార్త 19 hrs ago

Ford Company; ప్రముఖ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ (Ford), తమ సంస్థలో 11 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి విషయంలో వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.

కేవలం 1.95 డాలర్ల (సుమారు రూ. 186) విలువైన ఒక కుకీని దొంగిలించాడనే అక్రమ నిందతో ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. అయితే, సదరు ఉద్యోగి తన నిజాయతీని ఆధారాలతో సహా నిరూపించుకోవడమే కాకుండా, కంపెనీ పరువు తీసేలా గట్టి షాక్ ఇచ్చారు.

Read Also:Ohio State: నాలుగేళ్లపాటు 16 మంది పిల్లలను ఇంట్లో బంధించిన తల్లిదండ్రులు..కాపాడిన పోలీసులు

అసలేం జరిగింది?: రూ. 1.9 కోట్ల జీతం.. రూ. 186 కుకీ కోసం దొంగతనం?

అమెరికాలోని కెంటకీలో ఉన్న ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో (Ford Truck Plant) గత 11 ఏళ్లుగా పనిచేస్తున్న 60 ఏళ్ల కుర్ట్ క్రోమ్ (Kurt Krohm) కంపెనీలో అత్యంత సీనియర్ ఉద్యోగి. ఆయన వారానికి సగటున 60 గంటల పాటు విధుల్లో గడిపేవారు. ఆయన వార్షిక జీతం సుమారు $200,000 (దాదాపు రూ. 1.9 కోట్లు). ఒకరోజు పని మధ్యలో క్రోమ్‌కు రక్తంలో చక్కెర స్థాయులు (Blood Sugar Levels) ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో తక్షణ శక్తి కోసం ఫ్యాక్టరీలోని క్యాంటీన్ కియోస్క్‌లో $1.95 విలువైన కుకీ కొనుక్కుని తిన్నారు. కొద్దిసేపటికే ఆఫీస్‌కు పిలిపించిన అధికారులు, యూనియన్ ప్రతినిధి సమక్షంలో.. “నువ్వు కుకీ దొంగిలించావు, వీడియో సాక్ష్యం ఉంది” అంటూ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించి, ఫ్యాక్టరీ నుండి బలవంతంగా బయటకు పంపేశారు. “గత ఏడాది కాలంలో ఇదే క్యాంటీన్‌లో నేను $1,200 (దాదాపు రూ. 1.14 లక్షలు) ఖర్చు చేశాను. ఏడాదికి రూ.1.9 కోట్లు సంపాదించే నేను, కేవలం రూ.186 కుకీ కోసం దొంగతనం చేస్తానా?” అని యాజమాన్యాన్ని నిలదీశారు. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో రివర్స్ అటాక్.. నిజాయతీ నిరూపణ!

అవమానానికి గురైన క్రోమ్ కుంగిపోకుండా, తన డెబిట్ కార్డ్ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు. అందులో కుకీ కోసం $1.95 కట్ అయినట్లు క్లియర్ ట్రాన్సాక్షన్ ఉంది. ఆ స్క్రీన్‌షాట్‌ను ఫోర్డ్‌కు పంపినప్పటికీ, యాజమాన్యం ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను నోటరీ చేయించి పంపాలని మరింత వేధించింది. చివరకు క్యాంటీన్ కియోస్క్ ఆపరేటర్ అయిన ‘అరామార్క్’ (Aramark) సంస్థ, క్రోమ్ కుకీ కోసం డబ్బులు చెల్లించాడని జూన్ 12న ఫోర్డ్‌కు అధికారికంగా క్లీన్ చిట్ ఇచ్చింది.

Ford Company: ఫోర్డ్ ఆఫర్ తిరస్కరణ.. రూ. 1.9 కోట్ల జీతం కంటే ఆత్మగౌరవమే మిన్న!

తమ తప్పు తెలుసుకున్న ఫోర్డ్ యాజమాన్యం క్రోమ్‌ను తిరిగి విధుల్లోకి చేరాలని బ్రతిమాలింది. కానీ ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన కుర్ట్ క్రోమ్, ఫోర్డ్ ఇచ్చిన ఆఫర్‌ను మొహమాటం లేకుండా తిరస్కరించారు. అప్పటికే ఆయన టాలెంట్‌కు గుర్తింపుగా ఇంటికి సమీపంలోనే, అంతకంటే మెరుగైన జీతంతో (గంటకు $52.51 మరియు $10 అదనపు బోనస్) సరికొత్త ఉద్యోగం లభించింది. ఈ విధంగా తనపై పడిన నిందను చేరిపేసుకోవడమే కాకుండా, తనను అవమానించిన కార్పొరేట్ దిగ్గజానికి గట్టి బుద్ధి చెప్పారు.

Epaper: epaper.vaartha.com

అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్‌తబా ఖమేనీ హాజరవుతారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha