Dog bite: మన దేశంలో, వివిధ రాష్ట్రాలలో వీధికుక్కలు పల్లెపట్నం, వాడవాడల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఇవి చిన్న, పెద్ద అని తేడాలేకుండా అందరినీ కరుస్తూ భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి.
ముఖ్యంగా చిన్న పిల్లలపై మూకుమ్మడిగా క్రూరంగా దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. గురువారం రోజు భువనగిరిలో ఇంటి ఆరు బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి, అతని కనుగుడ్లను పీకేసిన హృదయ విదారక ఘటన జరిగింది. ప్రియాంష్ పై రెండు కుక్కలు దాడి చేశాయి. ఒక కుక్క ముఖంపై తీవ్రంగా కరిచి కనుగుడ్లను పీకేసింది. బాలుడు భయానక కేకలు విని పరుగున వచ్చిన వారు నేలపై పడి ఉన్న కనుగుడ్డును చూసి ఆందోళనలో కుక్కను తరిమి కొట్టి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. అదేరోజు మరో బాలుడుపై కూడా వీధి కుక్కలు దాడి చేశాయి.
Read Also : Egg rate today : హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన గుడ్డు ధరలు
They are brutally attacking and killing young children in groups.
ఇలా దేశంలో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. ఆ మధ్య గుంటూరులో వీధికుక్క నాలుగేళ్ల బాలుడి మెడపట్టి ఈడ్చి కేల్లడంతో పాపం ఆ పిల్లవాడికి అప్పుడే నూరేళ్లు నిండి పోయాయి. గతంలో మెదక్ జిల్లా తూప్రాన్లో శునకాలు ఒక్కరోజే పాతికమందిని గాయపరిచాయి. హనుమకొండలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సమయంలో ఢిల్లీ స్టేడియం దగ్గరే వీధికుక్కలు జపాన్, కెన్యా కోచ్లను కరిచాయి. ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వీధి కుక్కల విజృంభన తీవ్ర సమస్యగా పరినిమించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. జనం ఎక్కువగా గుమికూడే ప్రాం తాల నుంచి వీధికుక్కలను రక్షణ కేంద్రాలకు తరలించి, సంతాన నియంత్రణ చికిత్సలు చేయాలని ఆదేశించింది. వీధి కుక్కల జనాభాను కట్టడి చేయడంలో యంత్రాంగం చేతకానితనమే ప్రజా భద్రత(Public safety)కు పెనుముప్పుగా సంభవిస్తుం ది. వీధి కుక్కల గుంపుల సైర్వ్యహారంతో బయటికి (వీధుల్లో) రావాలంటేనే చాలామంది జంకుతున్నారు. వాటికి భయపడి పెద్దలు వాకింగ్ మానేస్తున్నారు, పిల్లలు పార్కు లకు, మైదానాల్లో ఆటలకు దూరమవుతున్నారు. అంతి మంగా ఇది ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీధి కుక్కలు భీకరంగా అరుస్తూ వాహనదారులను వెంబడిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
The incompetence of the machinery poses a major threat to public safety.
2030 కల్లా దేశంలో నుంచి రేబీస్ నన్ను తరిమికొట్టాలి అన్నది కేంద్రం లక్ష్యం. అది సహకారం కావాలంటే? సునకాల సంతాన నియంత్రణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తగినంతగా నిధులు కేటాయిం చాలి. ప్రభుత్వ ఆసుపత్రులు రేబిస్ టీకాలను విరివిగా అందు బాటులోకి ఉంచాలి. నానా రకాల చెత్త ఆహార వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయడం వీధి కుక్కల సంతతిని ఇబ్బడి ముబ్బడిగా చేస్తుందని ప్రజలు గుర్తించాలి. పశువర్ధక శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కోటిన్నరకు పైగా వీధి కుక్కలున్నాయి. అధికారిక గణాంకాల మేరకు నిరుడు దేశీ యంగా37లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యా యి. అంత ముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 21 శాతం అధికం! ఏటా 60 వేల మందిని కబళించేస్తుంది. వారిలో36 శాతం భారతీయులు కావడందురదృష్టకరం!. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులు రేబిస్ టీకాల కొరత లేకుండా చూడాలి. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ఉన్నత న్యాయస్థాన సూచనలతోపాటు, ప్రభు త్వాలు, అధికారులు, ప్రజలు ఉమ్మడి సంకల్పంతోనే కుక్కకాటు బెడద తీరి ప్రజా భద్రత (Public safety)సాధ్యమవుతోంది.
-మేకిరి దామోదర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

