భారతదేశంలో కులగణన నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ ప్రక్రియపై స్పష్టత లేకపోవడం సామాజిక న్యాయానికి ఆటంకమని ఆయన పేర్కొన్నారు.
కులగణన విషయంలో బీజేపీ ప్రభుత్వం తన పంథాను మార్చుకోవడాన్ని జైరాం రమేశ్ తప్పుబట్టారు. 2021లో కులగణన చేయకూడదని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని లోక్‌సభలో ప్రకటించింది. అంతేకాకుండా, సుప్రీంకోర్టులో కూడా ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించింది. ప్పుడు 2027 జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తామని చెప్పడం ఒక పెద్ద రాజకీయ మలుపు అని ఆయన అభివర్ణించారు. అయితే ఏడాది గడిచినా దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదని విమర్శించారు.
Read Also: Supreme Court: పవన్ ఖేరా ముందస్తు బెయిల్ తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
Census
Census: ‘అర్బన్ నక్సల్’ వ్యాఖ్యలపై ఆగ్రహం
కులగణన డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలను ప్రధాని మోదీ గతంలో ‘అర్బన్ నక్సల్స్’ అని సంబోధించడాన్ని జైరాం రమేశ్ గుర్తు చేశారు. సామాజిక వర్గాల జనాభా వివరాలు అడిగినందుకు అగౌరవంగా మాట్లాడిన ప్రధాని వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కులగణనపై ప్రధానికి రాసిన లేఖల గురించి జైరాం రమేశ్ వివరించారు. కులగణనను శాస్త్రీయంగా ఎలా నిర్వహించాలో చూపించిన తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలని ఖర్గే సూచించారు. 2025 మే నెలలో రాసిన లేఖకు కూడా ప్రధాని కార్యాలయం నుంచి కనీసం స్పందన రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కులగణన ప్రక్రియపై ఇప్పటికే ఒక ప్రణాళికను వెల్లడించింది.
జనాభా లెక్కలతో పాటే కులగణనను రెండు దశల్లో చేపడతారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

