Dailyhunt
కుంభమేళ మోనాలిసా కేసులో అసలేం జరుగుతోంది?

కుంభమేళ మోనాలిసా కేసులో అసలేం జరుగుతోంది?

వార్త 1 week ago

Monalisa: మోనాలిసా వివాహం, ఆమె వయస్సు చుట్టూ ముసురుకున్న వివాదం ముదురుతోంది. మధ్యప్రదేశ్ పోలీసులు విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా, ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రస్తుతం ప్రయాణం చేయలేరని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పోలీసులకు తెలియజేశారు.

Read Also:Ajith Kumar Returns to Chennai for Voting: ఓటు వేసేందుకు చెన్నై వచ్చిన నటుడు అజిత్ కుమార్

వివాదం అసలు కథేంటి?

ఈ కేసులో మోనాలిసా మైనర్ అన్న ఆరోపణలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి.పెళ్లి సమయంలో ఆమెకు 18 ఏళ్లు నిండాయని కేరళ పోలీసులు ధృవీకరించినప్పటికీ, జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) విచారణలో ఆమె మైనర్ అని తేలడం సంచలనమైంది.ఎస్టీ కమిషన్ నివేదిక ఆధారంగా ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్‌లో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది.మైనర్ అమ్మాయని, వివాహం చెల్లదని ఆరోపణలు వచ్చాయి.

 Monalisa POCSO Case

Monalisa: పోలీసుల నోటీసులు – ఫర్మాన్ వివరణ

తాజాగా మధ్యప్రదేశ్ పోలీసులు విచారణకు పిలవగా, ఫర్మాన్ ఖాన్ స్పందిస్తూ.మోనాలిసా ప్రస్తుతం గర్భవతి అని, ఆమె ఆరోగ్యం సరిగా లేదని పేర్కొన్నారు.వైద్యుల సలహా మేరకు ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరమని, అంత దూరం ప్రయాణం చేయడం ఆమెకు మరియు శిశువుకు ప్రమాదకరమని వివరించారు.అందుకే తాము విచారణకు హాజరు కాలేకపోతున్నామని పోలీసులకు విన్నవించారు.ప్రస్తుతం హైకోర్టు జోక్యంతో ఈ జంటకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మే 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha