Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుర్రాళ్ళు తెగ పాడుకుంటున్న పాట ఇదేనట!

కుర్రాళ్ళు తెగ పాడుకుంటున్న పాట ఇదేనట!

వార్త 1 week ago

Telugu Folk Songs: ప్రస్తుతం ఎక్కడ చూసినా సినిమా పాటల కంటే జానపద గీతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వాడకం పెరగడంతో పల్లె పాటలు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి.

అకేషన్ ఏదైనా సరే ఫోక్ సాంగ్స్ ఉంటేనే ఆ కిక్కు వేరుగా ఉంటోంది. యూట్యూబ్‌లో ఈ పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ రికార్డులు తిరగరాస్తున్నాయి. మన తెలంగాణ పాటలకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉండటం విశేషం.

Read also: Karuppu Movie: 'కరుప్పు' రిలీజ్‌కు బ్రేక్: చివరి నిమిషంలో షోలు రద్దు.. కారణం ఇదే!

 Ringu Ringula Juttudana Song Viral Still

Telugu Folk Songs: రింగు రింగుల జుట్టుదానా సాంగ్ రికార్డ్స్

ఇటీవల కాలంలో ‘రింగు రింగుల జుట్టుదానా’ అనే పాట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ విడుదలై పదకొండు నెలలు దాటినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటివరకు 84 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఈ పాటను చూశారు. సోషల్ మీడియాలో ఇన్ స్టా రీల్స్ చేస్తూ కుర్రాళ్లు ఈ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్నారు. ప్రతి ఫంక్షన్ లోనూ ఈ పాట ఇప్పుడు ఒక తప్పనిసరి ఐటమ్ అయిపోయింది.

పాట వెనుక ఉన్న క్రేజీ టీమ్

ఈ సూపర్ హిట్ సాంగ్ ను రాము రాథోడ్, ప్రభ ఎంతో అద్భుతంగా పాడారు. కళ్యాణ్ కీస్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను డ్యాన్స్ చేసేలా ఉత్సాహపరుస్తోంది. సురేష్ గంగుల, దేవ్ పవర్ అందించిన సాహిత్యం అందరికీ సులభంగా అర్థం అవుతోంది. రాము రాథోడ్ తో పాటు లిఖిత చేసిన డ్యాన్స్ ఈ సాంగ్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట వైరల్ అవ్వడంతో జానపద కళాకారులకు మంచి గుర్తింపు దక్కుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హీరోలకు బిగ్ షాక్ ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha