GT Live Match Score Updates: 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్(GT) ధీటుగా బదులిస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో బాధ్యత తీసుకున్న సాయి సుదర్శన్ అద్భుతమైన అర్ధ సెంచరీతో జట్టును ఆదుకుంటున్నాడు.
కేవలం 34 బంతుల్లోనే 54 పరుగులు చేసిన సుదర్శన్, రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు.
కుశాగ్ర అవుట్ – పరాగ్ బ్రేక్ థ్రూ
ఓపెనింగ్ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న వేళ, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్‌కు వచ్చి ఫలితాన్ని సాధించాడు. క్రీజులో సెట్ అయిన కుమార్ కుశాగ్ర (18)ను అవుట్ చేసి రాజస్థాన్‌కు తొలి వికెట్ అందించాడు. దీంతో 70 పరుగుల ఓపెనింగ్ పార్టనర్‌షిప్‌కు తెరపడింది.
GT Live Match Score Updates: చివరి 12 ఓవర్ల సమీకరణం
ప్రస్తుతం గుజరాత్ గెలవాలంటే ఓవర్‌కు 11 పరుగులకు పైగా సాధించాల్సి ఉంది. సాయి సుదర్శన్ క్రీజులో ఉండటం గుజరాత్‌కు సానుకూల అంశం కాగా, రాజస్థాన్ తన ప్రధాన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో మరిన్ని వికెట్లు తీయాలని ప్లాన్ చేస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఛేదన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది, మరి తెవాటియా వంటి ఫినిషర్లు గుజరాత్‌ను గట్టెక్కిస్తారో లేదో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

