Rakhi Festival : రక్షాబంధన్ వేడుకల వేళ భారత్‌లో గిఫ్టింగ్ సంస్కృతి వేగంగా రూపాంతరం చెందుతోంది. ఒకప్పుడు కేవలం సాధారణ దారం, మిఠాయిలకే పరిమితమైన ఈ పండుగ, ప్రస్తుతం లగ్జరీ గిఫ్ట్‌లు మరియు ప్రీమియం లోహాల కొనుగోళ్లకు వేదికగా మారింది.
ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన ‘రాఖీ ట్రెండ్స్ 2026’ నివేదిక ప్రకారం, ఈ ఏడాది రాఖీ ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 300 శాతం వార్షిక (YoY) వృద్ధిని నమోదు చేశాయి. ఆగస్టు 28న సరిగ్గా మధ్యాహ్నం 12:01 గంటలకు పండుగ రద్దీ తారాస్థాయికి చేరడంతో, నిమిషానికి గరిష్టంగా 857 రాఖీల చొప్పున ఆర్డర్లు నమోదు కావడం విశేషం. దారాల నుండి శాశ్వత జ్ఞాపకాలుగా నిలిచే ప్రీమియం డిజైనర్ రాఖీల డిమాండ్ 130 శాతం పెరగ్గా, స్మార్ట్‌వాచ్‌ల ఆర్డర్లు 99 శాతం, గిఫ్ట్ హ్యాంపర్లు 85 శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా రాఖీ ఆర్డర్ల రద్దీలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలవగా, ఆ తదుపరి స్థానాల్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ నిలిచాయి.

విలువైన లోహాలు, లగ్జరీ కానుకలు: వినియోగదారుల కొనుగోలు శైలిలో మార్పు
ఈ ఏడాది తోబుట్టువులు ఒకరికొకరు ఇచ్చే బహుమతుల్లో వెండి, బంగారు నాణేల రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 925 స్టెర్లింగ్ సిల్వర్, త్రిశూల్, సూర్య ఆకృతులతో పాటు పెండెంట్‌లుగా మార్చుకునే వినూత్న రాఖీలకు భారీగా ఆదరణ లభించింది. స్వరోవ్‌స్కీ పొదిగిన ‘లూంబా’ రాఖీలు సైతం లగ్జరీ విభాగంలో ట్రెండ్ సృష్టించాయి. ఈ సీజన్‌లో బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారుడు రూ. 10,995 విలువైన 24 క్యారెట్ల బంగారు నాణెం రాఖీలను కొనుగోలు చేయగా, గుర్గావ్‌లో లగ్జరీ స్కిన్‌కేర్, ఆర్టిసానల్ చాక్లెట్లు మరియు బంగారు నాణెం రాఖీలతో ఏకంగా రూ.14,630 విలువైన అత్యంత భారీ కార్ట్ ఆర్డర్ నమోదైంది. అలాగే ముంబైలో ఒకే ఆర్డర్‌లో 118 రాఖీలను, హైదరాబాద్‌లో 109 విభిన్న రకాల రాఖీలను ఒకేసారి కొనుగోలు చేయడం గమనార్హం. వినియోగదారులు ఉన్నత శ్రేణి (ప్రీమియం) ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్న ఈ ధోరణి, కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఇన్‌స్టామార్ట్ ‘స్విచ్’ (Switch) కాన్సెప్ట్‌కు అద్దం పడుతోంది.
FD పెట్టుబడిదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

