Shiva Rajkumar: కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తన తాజా చిత్రం 'పెద్ది' (Peddi) ప్రమోషన్లలో భాగంగా ఒక అత్యంత భావోద్వేగమైన విషయాన్ని పంచుకున్నారు.
2024లో తాను తీవ్రమైన క్యాన్సర్ బారిన పడిన సమయంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే తన స్థానంలో వేరే ఏ నటుడిని అనుకోకుండా, తాను పూర్తిగా కోలుకునే వరకు చిత్రబృందం ఓపికగా వేచి చూసిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
Shiva Rajkumar Emotional Comments
నా కోసం వేచి చూశారు: చిత్రబృందానికి శివన్న ధన్యవాదాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్ర ప్రమోషన్స్ చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సినిమా నుండి తప్పుకుంటానని మేకర్స్‌తో చెప్పాను. కానీ దర్శకుడు బుచ్చిబాబు మాత్రం ‘వద్దు సార్.. ఈ పాత్రకు మీరే కావాలి’ అని పట్టుబట్టారు. నా కోసం అంతకాలం వేచి చూసిన చిత్రబృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని ఎమోషనల్ అయ్యారు. అలాగే బుచ్చిబాబు తనకు కథ వివరించిన రోజే రామ్ చరణ్‌తో కూడా మాట్లాడానని ఆయన పేర్కొన్నారు.
Shiva Rajkumar: క్యాన్సర్‌పై విజయం.. మళ్లీ షూటింగ్‌లోకి..
2024లో శివ రాజ్‌కుమార్‌కు బ్లాడర్ క్యాన్సర్ (మూత్రాశయ క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని కోసం ఆయన అమెరికాలోని మయామిలో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు క్యాన్సర్ సోకిన బ్లాడర్‌ను తొలగించి, పేగు భాగంతో కృత్రిమ బ్లాడర్‌ను అమర్చారు. ఆ తర్వాత తన మనోధైర్యంతో 2025 ప్రారంభం నాటికి క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్న శివన్న, మళ్లీ ముఖానికి రంగు వేసుకుని ‘పెద్ది’ షూటింగ్‌లో పాల్గొన్నారు.
శివన్న నటనపై రామ్ చరణ్ ప్రశంసల జల్లు
ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ నటన అద్భుతంగా ఉందని కో-స్టార్ రామ్ చరణ్ కొనియాడారు. తాను ఇప్పటికే ఈ సినిమాను పలుమార్లు చూశానని చెప్తూ ముఖ్యంగా శివన్నపై వచ్చే ఒక స్లో-మోషన్ సీన్ ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని ఇస్తుందని చరణ్ లీక్ ఇచ్చారు. భారీ అంచనాలతో పాన్-ఇండియా లెవెల్లో రూపొందిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా జగన్ నివాళి

