Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లావణ్య మెరిసింది.. కథ నెమ్మదించింది!

లావణ్య మెరిసింది.. కథ నెమ్మదించింది!

వార్త 2 weeks ago

Sathi Leelavathi Movie Review: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన చిత్రం 'సతీ లీలావతి'. భార్యాభర్తల మధ్య సంబంధాలు, విడాకుల అంశం నేపథ్యంలో తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మే 8, 2026) విడుదలైంది.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

Read Also:NTR New Look : జూ.ఎన్టీఆర్ నయా లుక్ వైరల్ !!

Sathi Leelavathi Movie Review: కథా నేపథ్యం

లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్ డైరెక్టర్. చిన్నతనంలో తల్లిదండ్రుల (నరేష్, పవిత్ర) మధ్య చూసిన గొడవల ప్రభావం వల్ల ఆమెకు కొన్ని మానసిక భయాలు ఏర్పడతాయి. ఆ సమస్య నుంచి బయటపడే క్రమంలో రామ్ సేతు (దేవ్ మోహన్) అనే సైకాలజిస్ట్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి, తండ్రిని ఒప్పించి మరీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న మూడేళ్ల తర్వాత, రామ్ సేతు తనకు విడాకులు కావాలని అడుగుతాడు. తాను నర్సు నికోలా సెబాస్టియన్ (మడోనా సెబాస్టియన్)తో ప్రేమలో ఉన్నానని, విడాకులు ఇస్తే ఆమెతో కొత్త జీవితం మొదలుపెడతానని చెబుతాడు. ఆ మాటలతో కోపంతో రగిలిపోయిన లీలావతి అతన్ని చితకబాది ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత వారి బంధం ఏ మలుపు తిరిగింది, మధ్యలో వచ్చిన ఇతర పాత్రల నేపథ్యం ఏంటి, చివరకు వారు విడిపోయారా లేదా కలిశారా అనేది మిగతా కథ.

డిఫరెంట్ స్టోరీ కాకపోయినప్పటికీ.. లావణ్య త్రిపాఠి కథను తన పాత్ర ద్వారా నడిపించిన విధానం బాగుంది. సినిమా భారాన్నంతా తన భుజాలపైనే మోసి.. వన్ ఉమెన్ షో అనే విధంగా తన పాత్రతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను చాలా సులభంగా పోషించారు. దేవ్ మోహన్ కూడా తన పాత్ర పరిధి మేరకు రాణించారు. మడోన్నా సెబాస్టియన్ పాత్ర నిడివి తక్కువే. ఆమె రోల్ కాస్త పెంచి గ్లామర్ డోస్ పెంచితే బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. లావణ్య, దేవ్, మడోన్నా మధ్య డ్రామా గురించి ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే డిఫరెంట్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. సప్తగిరి తనదైన కామెడీతో మరోసారి సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారారు. నరేష్, పవిత్ర ట్రాక్ కొద్దిసేపే అయినా..

ఫన్, ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా బ్యాక్ డ్రాప్‌కు సంబంధించిన సన్నివేశాలను నేచురల్‌గా తెరకెక్కించారు. కోసనమ్ విఠల్ ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. చాలా సన్నివేశాలను మిక్కి జే మేయర్ తన మ్యూజిక్‌తో హైలెట్ చేశాడు. ఎడిటింగ్ విషయంలో సతీష్ సూర్య ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. కొంత నిడివి తగ్గిస్తే.. ఫీల్, రన్ బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. నిర్మాత నాగ మోహన్ ఎంచుకొన్న కథ, నటీనటులు బాగుంది. ఆయన పాటించిన నిర్మాణ విలువలు క్లాస్‌గా ఉన్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే.. ఇదోక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా మారేంది. దాంపత్య జీవితంలో విభేదాలు, విడాకులు, లవ్, ఎమోషన్స్ అంశాలతో రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఓటీటీలోకి 'ధురంధర్ 2'..భారత్ లో కాదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha