Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లైబ్రరీలో బుక్ చోరీ.. 40 ఏళ్ల తర్వాత రిటర్న్..!

లైబ్రరీలో బుక్ చోరీ.. 40 ఏళ్ల తర్వాత రిటర్న్..!

వార్త 7 hrs ago

The Unstrung Harp Book : అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ లైబ్రరీ నుంచి దొంగిలించిన అరుదైన (The Unstrung Harp Book) పుస్తకాన్ని ఓ వ్యక్తి తాజాగా తిరిగి అప్పగించాడు.

అంతేకాదు, తన తప్పును అంగీకరిస్తూ హృదయాన్ని తాకే క్షమాపణ లేఖతో పాటు 100 డాలర్లను కూడా జతచేసి పంపించాడు.

ఎడ్వర్డ్ గోరే రచించిన ది అన్‌స్ట్రంగ్ హార్ప్ :

ఆ వ్యక్తి తిరిగి ఇచ్చిన పుస్తకం ప్రముఖ అమెరికన్ రచయిత, చిత్రకారుడు ఎడ్వర్డ్ గోరే రచించిన “ది అన్‌స్ట్రంగ్ హార్ప్” (The Unstrung Harp) తొలి ఎడిషన్ కాపీ. ఈ పుస్తకం మొదటిసారిగా 1953లో ప్రచురితమైంది. రచయిత జీవితంలోని ఒత్తిళ్లు, రచనా ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను వినోదాత్మకంగా చూపించిన ఈ పుస్తకం సాహిత్యాభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.

పుస్తకాన్ని తిరిగి పంపిన వ్యక్తి తన పేరును వెల్లడించలేదు. అయితే, తాను ఎన్నో ఏళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పటికీ మనసును బాధిస్తోందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అందుకే ఆలస్యమైనా పుస్తకాన్ని అసలు యజమానులకు తిరిగి అందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. అలాగే, పుస్తకాన్ని ఇంతకాలం తన వద్ద ఉంచినందుకు చిహ్నంగా 100 డాలర్లను కూడా జతచేశాడు.

లైబ్రరీ నిర్వాహకులు ఈ ఘటనను ఆశ్చర్యంగా, ఆనందంగా స్వాగతించారు. ఇలాంటి అరుదైన తొలి ఎడిషన్ పుస్తకాలు తిరిగి దక్కడం చాలా అరుదని వారు పేర్కొన్నారు. డబ్బు కంటే, తన తప్పును అంగీకరించి పుస్తకాన్ని తిరిగి ఇవ్వాలనే ఆ వ్యక్తి నిజాయితీ మరింత విలువైనదని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యమైనా తప్పును సరిదిద్దుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుందనే సందేశాన్ని మరోసారి గుర్తు చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, తప్పు చేసినా ఒప్పుకుని సరిదిద్దుకోవడం గొప్ప విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

స్లమ్ డాగ్.. అప్పటి పూరీని గుర్తు చేస్తాడా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha