Dailyhunt
లైసెన్స్ లేకుండా పాల విక్రయాలు చేస్తే రూ.5 లక్షలు జరిమానా

లైసెన్స్ లేకుండా పాల విక్రయాలు చేస్తే రూ.5 లక్షలు జరిమానా

వార్త 2 weeks ago

Rajamahendravaram Milk Sales: రాజమహేంద్రవరం జిల్లాలో అనధికారికంగా పాల విక్రయాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.

కల్తీ పాలు ఘటనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్థాయిల పాల ఉత్పత్తి దారులు, విక్రేతలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పశు సంవర్ధక అధికారి డా. టి. శ్రీనివాసరావు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డా. కె. సుప్రియలకు తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆదేశించారు.

Read Also: AP Heatwave Alert: 73 మండలాల్లో నేడు తీవ్ర వడగాడ్పులు

 Selling milk without a license incurs a fine of ₹5 lakhs.

Rajamahendravaram Milk Sales: పర్యవేక్షణకు సంయుక్త బృందాల ఏర్పాటు

జిల్లాలో పాలు, పాల ఉత్పత్తులు, మాంసాహార పదార్థాల నాణ్యతపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేయడానికి పశు సంవర్ధక శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.ప్రస్తుతం జిల్లాలో సుమారు 651 మంది పాల విక్రేతలు లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అదే విధంగా సుమారు 650 మంది ఇంటింటికి పాలు సరఫరా చేసే వ్యక్తులు, మరో 725 మంది అనధికారిక పాల విక్రేతలు, షాపు యజమానులు, పాల సహకార సంఘాలు లైసెన్స్ లేకుండా పాల సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా

జిల్లాలో పాల నాణ్యతను కాపాడడం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాల సరఫరా కోసం లైసెన్స్ పొందాలని సూచించారు. లైసెన్స్ లేకుండా పాల విక్రయాలు నిర్వహిస్తున్న వారిపై రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాల విక్రయాలు చేసే వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి వివరాలు వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పశుసంవర్ధక సహాయకులు తమ పరిధిలో ఉన్న పాల విక్రేతలను గుర్తించి, వారికి అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక అధికారి టి శ్రీనివాస రావు తెలియ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ పాలు రూ.2 పెంపు పెరుగు బకెట్లపై రూ.30 హెచ్చింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha