Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లక్నోలోని పూర్ణియాలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

లక్నోలోని పూర్ణియాలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

వార్త 1 week ago

Major fire accident in Purania, Lucknow : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పూర్ణియా ప్రాంతంలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించింది. ఒకే భవనంలో నడుస్తున్న కోచింగ్ సెంటర్, ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 11 మంది సజీవదహనమయ్యారు.

భవనం కింద ఉన్న ఫర్నిచర్ షాపులో తొలుత మంటలు అంటుకుని, క్షణాల వ్యవధిలో పై అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్‌కు వ్యాపించాయి. మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో, క్లాసుల్లో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం పైనుంచి కిందికి దూకగా, మరికొందరు దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.

Read Also : అపాచీ, ఎం777 హోవిట్జర్ల నిర్వహణకు అమెరికా గ్రీన్ సిగ్నల్

రక్షణ చర్యలు.. క్షతగాత్రుల పరిస్థితి

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది, ఎట్టకేలకు ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే, వీరంతా తీవ్రమైన పొగ పీల్చడం, కాలిన గాయాలపాలవడంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కింది అంతస్తులోని ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భవనంలో కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు (Fire Safety Norms) పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఉత్తరాఖండ్ గురుద్వారా వద్ద ఆర్మీ మోహరింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha