Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లళింగ్ ఘాట్‌లో ట్రక్కులను ఢీకొట్టిన లగ్జరీ బస్సు.. ఆరుగురు దుర్మరణం!

లళింగ్ ఘాట్‌లో ట్రక్కులను ఢీకొట్టిన లగ్జరీ బస్సు.. ఆరుగురు దుర్మరణం!

వార్త 3 weeks ago

Dhule Laling Ghat Accident: మహారాష్ట్రలోని ధులే (Dhule) జిల్లా పరిధిలో ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లళింగ్ ఘాట్ (Laling Ghat) సమీపంలో మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఈ టిహరీ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద తీవ్రతకు రహదారిపై ఒక వైపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో.. పోలీసులు వాహనాలను నాసిక్ వైపు వెళ్లే లైన్‌లోకి మళ్లించి క్లియర్ చేశారు.

Read Also :Nashik Conversion Case: నాసిక్ అత్యాచారం, అక్రమ మార్పిడి కేసులో కీలక మలుపు

తొందరపాటు.. ఆపై మృత్యుపాశం

 Mumbai Agra Highway Accident Today

పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఇసుక లోడుతో వెళ్తున్న ఒక డంపర్ ట్రక్ లళింగ్ ఘాట్ వద్ద జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో (తప్పుడు దిశలో) దూసుకువచ్చింది. ఈ క్రమంలో ధులే వైపు వెళ్తున్న ఓ భారీ కంటైనర్ ట్రక్‌ను ఈ డంపర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సమీపంలోని లళింగ్ టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని హైవేపై నిలిచిపోయిన ట్రక్కులను పక్కకు తొలగించేందుకు, బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే, మొదటి ప్రమాదం జరిగిన దాదాపు గంట తర్వాత.. నాసిక్ వైపు నుంచి ధులే వైపు వేగంగా వస్తున్న ఒక లగ్జరీ ట్రావెల్స్ బస్సు, అప్పటికే రోడ్డుకు అడ్డంగా ఢీకొని ఉన్న రెండు ట్రక్కులను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ రెండో ప్రమాదం అత్యంత ఘోరంగా మారడంతో ప్రాణనష్టం పెరిగింది.

Dhule Laling Ghat Accident: టోల్ ప్లాజా సిబ్బంది సహా ఆరుగురు బలి

ఈ దారుణ ఘటనలో మరణించిన ఆరుగురిలో ఐదుగురు లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న వారు (డ్రైవర్, క్లీనర్ సహా) కాగా.. ఆరో వ్యక్తి మొదటి ప్రమాద బాధితులను కాపాడేందుకు వచ్చిన స్థానిక లళింగ్ టోల్ ప్లాజా ఉద్యోగి కావడం గమనార్హం. గాయపడిన 20 మంది ప్రయాణికులను పోలీసులు, సహాయక బృందాలు వెనువెంటనే ధులే సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ మరియు ఘాట్ రోడ్డుపై వేగమే ఈ పెను ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లోయలో పడ్డ స్కార్పియో.. 8 మంది దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha