Dailyhunt

Latest News: Bigg Boss 9: ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్

వార్త 4 months ago

బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss 9) లో ఈ వారం నామినేషన్స్ ఏకంగా హౌస్‌ను రణరంగంగా మార్చేశాయి. వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ పెట్టిన బిగ్‌బాస్‌కి ఇది అంతకుమించిన ఫైర్ అని నిరూపించారు హౌస్‌మేట్స్.

సోమవారం జరిగిన నామినేషన్స్‌లో రెండు రౌండ్ల విధానం పాటించడంతో సభ్యుల మధ్య ఘాటైన మాటల యుద్ధం, ఆరోపణలు, ఎదురు దాడులు చోటుచేసుకున్నాయి.

Bigg Boss 9: స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

మొదటి రౌండ్ నామినేషన్స్‌లో భరణికి 2 ఓట్లు, పవన్‌కు 2 ఓట్లు, సుమన్, తనూజ, కళ్యాణ్, సంజనలకు ఒక్కో ఓటు వచ్చాయి. పెద్దగా రచ్చ లేకుండానే మొదటి రౌండ్ ముగిసింది. రెండో రౌండ్లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హౌస్ (Bigg Boss 9) సభ్యులు మొదటి రౌండ్‌లో నామినేట్ చేయని ఇంకొకరిని నామినేట్ చేయాల్సి రావడంతో వాదనలు చెలరేగాయి.

దివ్య 'మంచిదే కానీ నోరు కంట్రోల్‌లో ఉండదు' అంటూ భరణి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఆగ్రహానికి గురి చేశాయి.దివ్య వెంటనే కౌంటర్ ఇస్తూ..మీలా సాఫ్ట్‌గా డీల్ చేయను. అవసరం వస్తే వాయిస్ రైజ్ చేస్తాను అని స్పష్టం చేసింది. ఇక తనూజ కెప్టెన్సీ విలువ గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించిందని ఇమ్ము అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇమ్మూ కూడా నామినేషన్స్‌

దీనికి తనూజ కూడా ఘాటుగానే స్పందిస్తూ..కరెక్ట్ పాయింట్ ఉంటేనే నామినేట్ చేయి. నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని తిప్పికొట్టింది. అనంతరం పవన్ ఇమ్మూ పేరును నామినేషన్స్‌లో వేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రెబల్ టాస్క్‌లో ఇమ్మూ తన పేరును చెప్పిన విషయం ప్రస్తావిస్తూ పవన్ భావోద్వేగానికి లోనయ్యాడు.

మధ్యలో కళ్యాణ్ రావడంతో హౌజ్ హీటెక్కింది. కళ్యాణ్ ఆరోపిస్తూ .. పవన్ తన గేమ్ తానే ఆడడంలేదు… రీతూ కోసమే ఆడుతున్నాడు' అని కామెంట్ చేయడంతో రీతూ కూడా వాగ్వాదంలోకి దిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంజన వ్యాఖ్యలు

ఎపిసోడ్ చివరిలో రీతూ చౌదరి-సంజన మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. తనని నామనేట్ చేసినందుకు సంజన.. రీతూపై పర్సనల్ అటాక్ చేసింది. డీమాన్-రీతూ రిలేషన్ గురించి సంజన ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. ఇది చూస్తుంటే కొన్ని వారాల క్రితం దివ్వెల మాధురి.. రీతూతో నీది డీమాన్‌ది అన్‌హెల్తీ రిలేషన్ అంటూ కామెంట్స్ చేసిందే గుర్తొచ్చింది.

అయితే ఈసారి సంజన కాస్త గీత దాటే కామెంట్స్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే రోజూ రాత్రి నువ్వు డీమాన్ దగ్గర అంటూ సంజన చేసిన కామెంట్లకి హౌస్‌మేట్స్ కూడా షాకైపోయారు. ఇమ్మానుయేల్ అయితే సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఎంత చెప్తున్నా కూడా సంజన మాత్రం వెనక్కి తగ్గలేదు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Latest News: Bigg Boss 9: ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఆమేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha