Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ

లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ

వార్త 1 month ago

Lenin Movie Twitter Review: చాలా కాలం విరామం తర్వాత అక్కినేని యువ హీరో అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్'. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది.

యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఇప్పటికే మార్నింగ్ షోలు చూసిన ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

థియేటర్లలో 'లెనిన్' టాక్ ఎలా ఉందంటే?

సినిమా చూసిన ఆడియన్స్ నుంచి 'లెనిన్' చిత్రానికి ఉదయం ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అఖిల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, సరికొత్త మేకోవర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమాలో ఆయన నటన కెరీర్ బెస్ట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ మురళీ కిషోర్ ఫ్రెండ్‌షిప్, లవ్ ట్రాక్స్ మరియు ఎమోషనల్ సీన్లను అద్భుతంగా డీల్ చేశారని నెటిజన్లు కొనియాడుతున్నారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా ఫ్రెష్‌గా ఉందనే టాక్ వినిపిస్తోంది.

Lenin Movie Twitter Review: సినిమాకు ప్రధాన ఆకర్షణలు ఇవే!

ప్రీ-ఇంటర్వెల్ మరియు ఇంటర్వెల్ కి ముందు వచ్చే 30 నిమిషాల సీక్వెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని, ఊహించని ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో మోత మోగించిందని టాక్. అక్కినేని నాగార్జున, నాగదేవర సూర్యవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రల్లో మెరిశారు. మొత్తానికి అఖిల్ 'లెనిన్' చిత్రంతో ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని, ఇది పక్కా 'హిట్టు బొమ్మ' అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha