Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'లెనిన్' యాక్టర్స్ కు ఏ రేంజ్ లో రెమ్యునరేషన్స్ ఇచ్చారంటే !

'లెనిన్' యాక్టర్స్ కు ఏ రేంజ్ లో రెమ్యునరేషన్స్ ఇచ్చారంటే !

వార్త 3 weeks ago

Akhil Lenin : అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.

67.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ భారీ సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్ అందుకున్న పారితోషికాల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

చాలా కాలం తర్వాత సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ చిత్రం ఒక లైఫ్ లైన్‌గా మారింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, మొదటి వీకెండ్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ముఖ్యంగా థియేటర్లలో అఖిల్ మాస్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం 4 రోజుల్లోనే రూ. 67.2 కోట్లు రాబట్టి అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

కోట్లలో రెమ్యునరేషన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న లిస్ట్

సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడంతో, ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తీసుకున్న పారితోషికాల గురించిన చర్చ నెట్టింట జోరందుకుంది. ప్రచారం జరుగుతున్న వివరాల ప్రకారం.. ఈ చిత్రం కోసం అఖిల్ అక్కినేని రూ. 8 కోట్ల పారితోషికం అందుకోగా, సినిమాకు తన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ రూ. 4 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రూ. 2 కోట్లు, కీలక పాత్రల్లో మెరిసిన శివాజీ రూ. 80 లక్షలు, సునీల్ రూ. 60 లక్షలు పారితోషికంగా పొందినట్లు సమాచారం. సీనియర్ నటీనటులు ఈశ్వరీ రావుకు రూ. 38 లక్షలు, రామ్కీకి రూ. 30 లక్షలు అందినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.

'వెంకట్రామయ్య గారి తాలూకా' ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha