Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లేపాక్షి సిబ్బందికి శుభవార్త.. 10 శాతానికి పైగా పెరగనున్న జీతాలు!

లేపాక్షి సిబ్బందికి శుభవార్త.. 10 శాతానికి పైగా పెరగనున్న జీతాలు!

వార్త 3 months ago

AP Government: ఆంధ్రప్రదేశ్ లేపాక్షి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు ప్రకటనతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలు భారీగా పెరగడంతో, ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అందుతున్న మూల వేతనంపై పది శాతానికి పైగా వేతనాన్ని పెంచుతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.60.75 కోట్లకు చేరడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అమ్మకాలను రూ.80 కోట్లకు చేర్చాలని ఆమె ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.

Read also: AP Industrial Parks: ఏపీలో కొత్తగా 38 ఇండస్ట్రియల్ పార్కులు

 Lepakshi employees salary hike

కొత్త షోరూమ్‌లు ఆధునికీకరణ వైపు అడుగులు

రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా కొత్త లేపాక్షి షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ఉన్న వాటిని వినియోగదారులకు నచ్చేలా ఆధునికీకరిస్తామని చెప్పారు. ఢిల్లీ, కాకినాడ షోరూమ్‌ల మరమ్మతులు పూర్తయ్యాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కొత్త షోరూమ్ ఏర్పాటుకు విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. కళాఖండాలను ఈ-కామర్స్ ద్వారా డోర్ డెలివరీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె వెల్లడించారు.

AP Government: ఏఐ సాంకేతికతతో సేవల విస్తరణ

లేపాక్షి షోరూమ్‌ల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఏఐ సాంకేతికతను వాడుతున్నామని మంత్రి వివరించారు. తరంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, కళాక్షి వాట్సాప్ బాట్‌ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. కళాక్షి ద్వారా దైనందిన అమ్మకాలు, సిబ్బంది పనితీరు, ఏ ప్రాంతంలో ఏ కళారూపాలకు డిమాండ్ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ప్రజలు ఈ-కామర్స్ తరహాలో వాట్సాప్ ద్వారా సులభంగా హస్తకళా వస్తువులను ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ డిజిటల్ విప్లవం ద్వారా లేపాక్షి సంస్థను ఉన్నత స్థానంలో నిలబెడతామని ప్రభుత్వం పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య చిక్కుకున్న దౌత్య వివాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha