Karnataka Lift Accident: కర్ణాటకలోని శివమొగ్గలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయంలో జరిగిన ఎలివేటర్ (లిఫ్ట్) ప్రమాదంలో 80 సంవత్సరాల విశ్రాంత ఇంజనీర్ తీవ్ర గాయాలపాలై మృతి చెందారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. శివమొగ్గలోని వినోభా నగర్‌కు చెందిన విశ్రాంత ఇంజనీర్ కుమారస్వామి (80) ఆదివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో నివాసం నుంచి బయలుదేరారు. ముందుగా వినాయక నగర్‌లోని రోటరీ బ్లడ్ బ్యాంక్‌లో రక్త పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం సమీపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటానని తన భార్య లలిత (75)కి చెప్పి వెళ్లారు.
Read Also : Cough Syrup : ఒడిశాలో రూ. 1 కోట్ల విలువైన నిషేధిత దగ్గు మందుతో ఇద్దరు అరెస్టు
Retired engineer dies after getting trapped in lift!
Karnataka Lift Accident: ప్రమాదం జరిగింది ఎలా?
ఆలయానికి చేరుకున్న కుమారస్వామి, పై అంతస్తుకు వెళ్లేందుకు ఎలివేటర్ బటన్ నొక్కారు. అయితే, లిఫ్ట్ క్యాబిన్ కిందకు వచ్చిందనే భ్రమలో ఆయన బయటి మ్యాన్యువల్ డోర్ తెరిచి షాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో లిఫ్ట్ క్యాబిన్ పై అంతస్తులోనే ఉంది. ఆయన లోపలికి అడుగుపెట్టిన మరుక్షణమే పైనుంచి వేగంగా కిందకు దిగిన లిఫ్ట్ క్యాబిన్ ఆయనపై పడటంతో, ఎలివేటర్ కింద చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్ట్ కింద చిక్కుకున్న కుమారస్వామిని బయటకు తీశారు. అనంతరం ఆయనను మెక్‌గాన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికి ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై పోలీసుల విచారణ
ఈ ప్రమాదంపై మృతుడి భార్య లలిత ఫిర్యాదు చేయడంతో శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లిఫ్ట్ క్యాబిన్ అక్కడికి రాకుండానే బయటి మ్యాన్యువల్ డోర్ ఎలా తెరుచుకుంది, డోర్ లాకింగ్ సిస్టమ్‌లో ఏమైనా యాంత్రిక లోపం ఉందా లేక ఆలయ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో జిల్లా ఎస్పీ బి.నిఖిల్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అస్సాంలో సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ కాల్పుల కలకలం: ఇద్దరు జవాన్లు బలి, మరొకరికి తీవ్ర గాయాలు

