Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లిక్కర్ కంపెనీ సూపర్ వైజర్ ఆగడాలు.. లైంగిక వేధింపులపై మహిళా కార్మికుల ధర్నా!

లిక్కర్ కంపెనీ సూపర్ వైజర్ ఆగడాలు.. లైంగిక వేధింపులపై మహిళా కార్మికుల ధర్నా!

వార్త 1 month ago

Sangareddy: డ్యూటీ సమయంలో మహిళ కార్మికులపై సూపర్ వైజర్ దురుసుగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధిస్తూ.. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడంటూ MS లిక్కర్ కంపెనీ ముందు మహిళ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్. ఇటిక్యాల Ms లిక్కర్ కంపెనీ ముందు చోటుచేసుకుంది. కంపెనీ సూపర్ వైజర్ తోపీ రవి తమతో అసభ్య పదజాలంతా దూషిస్తున్నాడని మహిళా కార్మికులు ఆరోపించారు. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే తమను టార్గెట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా కార్మికులు తెలిపారు.

Read Also: TG Police Promotions: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రమోషన్ల జాతర.. ఆ జిల్లాల వారికే ప్రాధాన్యం!

నిన్న రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న మహిళతో సూపర్వైజర్ తోపీ రవి అసభ్య పదజాలంతో మాట్లాడడంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. దీంతో కంపెనీ వద్ద కొంత ఆందోళన నెలకొంది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి మహిళా కార్మికులు కంపెనీ ముందు నిరసన వ్యక్తం చేస్తూ సూపర్వైజర్ తోపీ రవి పై కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకొని అతనిని విధుల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ మహిళా కార్మికులను లెక్కచేయకుండా సూపర్వైజర్ తోపీ రవి పట్ల సానుకూలంగా మాట్లాడడం తో మహిళా కార్మికులు విధులను బహిష్కరించి కంపెనీ నుండి బయటికి వచ్చారూ. అనంతరం మహిళలంతా కలిసి కంపెనీ నుండి బయటికి వచ్చి సూపర్వైజర్ తోపీ రవి పై ఫిర్యాదు చేసేందుకు ఆటోలో పుల్కల్ పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు. టోపీ రవి వల్ల తమకు ప్రమాదం ఉందని.. విధుల నుండి టోపీ రవి నీ సస్పెండ్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలనీ మహిళా కార్మికులంతా కలిసి పుల్కల్ ఎస్సై విశ్వజన్ కు ఫిర్యాదు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రైతన్నకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా: నిర్మల్ పంట నష్టంపై అధికారులకు కీలక ఆదేశాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha