Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోన్ తీసుకున్నవారికి బిగ్ షాక్ ?

లోన్ తీసుకున్నవారికి బిగ్ షాక్ ?

వార్త 2 weeks ago

Repo Rate : బ్యాంకుల నుంచి హోమ్, కార్ మరియు పర్సనల్ లోన్లు తీసుకున్న వినియోగదారులకు రానున్న రోజుల్లో వడ్డీ భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తన కీలకమైన రెపో రేటును 2027 మార్చి చివరి నాటికి 5.75 శాతం నుండి 6 శాతానికి పెంచే అవకాశముందని యూనియన్ బ్యాంక్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో రెపో రేటు 5.25 శాతంగా ఉంది. రాబోయే కాలంలో ద్రవ్యోల్బణ ముప్పు (Inflation) పెరుగుతుండటం, అలాగే మార్కెట్‌లో లిక్విడిటీ పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని బ్యాంకింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ 2 నుండి 3 విడతల్లో, ప్రతిసారి 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను పెంచవచ్చని పేర్కొంది.

 RBI Interest Rates

EMIలు, డిపాజిట్ వడ్డీ రేట్లపై పడే ప్రత్యక్ష ప్రభావం

ఆర్‌బీఐ రెపో రేటును పెంచితే దాని ప్రభావం నేరుగా సాధారణ ప్రజలు మరియు రుణగ్రహీతలపై పడుతుంది. రెపో రేటు పెరిగినప్పుడు వాణిజ్య బ్యాంకులు తమ వద్ద తీసుకున్న లోన్ల ఆధారిత వడ్డీ రేట్లను మార్చుతాయి. దీనివల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు (EMIs) గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మరొకవైపు, బ్యాంకులు డిపాజిటర్లను ఆకట్టుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs) మరియు ఇతర సేవింగ్స్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను కూడా పెంచుతాయి. దీంతో రుణాలు ఉన్నవారిపై నెలవారీ భారం పెరుగుతుంటే, పొదుపు చేసుకునే వారికి మాత్రం ఎక్కువ లాభం చేకూరే అవకాశముంది.

ఢిల్లీలో కుండపోత వర్షం..ఐఎండీ తీవ్ర హెచ్చరికలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha