నేపాల్ రాజధాని ఖాట్మండులో ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు పెను వివాదానికి దారితీశాయి. ఈ క్రమంలో 11 ఏళ్ల చిన్నారి రాధిక మహతో ప్రధాని బాలేంద్ర షాకు రాసిన లేఖ ఇప్పుడు ఆ దేశ పౌరుల కళ్లను చెమర్చిస్తోంది.
తమ ఓటుతో గెలిచిన ప్రభుత్వమే తమ పొట్ట కొట్టడంపై ఆ చిన్నారి సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాధిక మహతో కుటుంబం ఖాట్మండులోని థపథలి ప్రాంతంలో ఒక చిన్న గుడిసెలో నివసించేది. ప్రభుత్వం బుల్డోజర్లతో ఆ నివాసాలను కూల్చివేయడంతో, వారిని 75 కిలోమీటర్ల దూరంలోని బనేపా మున్సిపాలిటీకి తరలించారు. ఈ మార్పు వల్ల ఖాట్మండులోని స్కూల్లో మూడో తరగతి చదువుతున్న రాధిక చదువు ఆగిపోయింది. “మాకు అద్దె ఇల్లు తీసుకునే స్తోమత లేదు.. ఇప్పుడు మేమెక్కడ ఉండాలి? ఎలా చదువుకోవాలి?” అంటూ ఆ చిన్నారి రాసిన మాటలు ప్రభుత్వ నిర్దాక్షిణ్య వైఖరిని ఎత్తిచూపుతున్నాయి.
Read Also: NEET-UG 2026: నీట్ పేపర్ లీక్ కేసులో బ్యూటీ పార్లర్ గుట్టురట్టు: మనీషా వాఘ్మారే అరెస్ట్
Prime Minister of Nepal
Prime Minister of Nepal: మండిపడుతున్న మానవ హక్కుల సంఘాలు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, నదీ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 4,000 తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. దీనివల్ల దాదాపు 15,000 మంది పేదలు నిరాశ్రయులయ్యారు. నగరాభివృద్ధి మరియు వరద నివారణ కోసం ఈ చర్యలు తప్పనిసరని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ, ప్రత్యామ్నాయం చూపకుండా పేదలను రోడ్డున పడేయడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం నేపాల్ సుప్రీంకోర్టుకు చేరడంతో, కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సరైన పునరావాస ప్రణాళిక లేకుండా పేదలను ఖాళీ చేయించవద్దని, నివాస మరియు విద్యా హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని జస్టిస్ కుమార్ రెగ్మీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్నారి లేఖ వెలుగులోకి రావడంతో నేపాల్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పోఖరా వంటి నగరాల్లో బాధితులు కాగడాల ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

