Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మా రక్షణ అవసరాల కోసం అమెరికాపై ఆధారపడం: గల్ఫ్ దేశాలు

మా రక్షణ అవసరాల కోసం అమెరికాపై ఆధారపడం: గల్ఫ్ దేశాలు

వార్త 2 months ago

మెరికా, ఇరాన్‌ల మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. కానీ గల్ఫ్‌ దేశాల్లో మాత్రం అభద్రత నెలకొంది. ఇరాన్ ఏ క్షణం, ఎక్కడ దాడులు చేస్తుందో అనేదానిపై ఆందోళన ఉంది.

ఈ క్రమంలోనే సౌదీ అరేబియా, UAE, ఖతార్ లాంటి దేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. తమ రక్షణ అవసరాల కోసం ఎల్లప్పుడూ అమెరికాపై ఆధారపడకూడదని నిర్ణయించాయి. ప్రస్తుతం అమెరికా ఆయుధ పరిశ్రమలో ఉన్న సరఫరా జాప్యం, ఉత్పత్తి తగ్గిన కారణంగా గల్ఫ్ దేశాలు ఇప్పుడు దక్షిణ కొరియా, ఉక్రెయిన్ లాంటి దేశాల వైపు చూస్తున్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం వెల్లడించింది.

Read Also: Vivekananda Statue in Seattle:సీటెల్ నడిబొడ్డున స్వామి వివేకానంద భారీ విగ్రహావిష్కరణ!

 Gulf Countries

Gulf Countries: సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్‌తో ఒప్పందాలు

ప్రస్తుతం ఇరాన్ ప్రయోగిస్తున్న చౌకైన డ్రోన్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఖరీదైన పేట్రియాట్ మిస్సైల్స్‌ను వాడటం గల్ఫ్ దేశాలకు భారంగా మారుతోంది. అందుకోసమే దీనికి ప్రత్యామ్నాయంగా.. దక్షిణ కొరియాకు చెందిన M-SAM క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం సౌదీ అరేబియా చర్చలు చేస్తోంది. డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేయగల ఈ సిస్టమ్‌ UAE ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు బ్రిటన్‌కు చెందిన పలు స్టార్టప్ కంపెనీల నుంచి కూడా తక్కువ ధరకే చిన్న తరహా క్షిపణులను కొనుగోలు చేయాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తాజాగా ఖతార్‌ అధికారులు ఉక్రెయిన్ శిక్షణ కేంద్రాలను సందర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha