Dailyhunt
Maa Illu : 'మా ఇల్లు' అనాథాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

Maa Illu : 'మా ఇల్లు' అనాథాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

వార్త 3 months ago

నగామ జిల్లా జాఫర్గఢ్‌లోని 'మా ఇల్లు' అనాథాశ్రమ వ్యవస్థాపకుడు గాదె ఇన్నయ్య అకాల మరణం ఆ ప్రాంతంలో తీరని లోటును మిగిల్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు నేడు ఆశ్రమాన్ని సందర్శించారు.

ఇన్నయ్య మరణంతో తండ్రిని కోల్పోయినట్టుగా బాధపడుతున్న అనాథ పిల్లలను ఆమె దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఇన్నయ్య లేని వెలితి స్పష్టంగా కనిపిస్తున్న ఆ సమయంలో, కన్నీరు మున్నీరవుతున్న చిన్నారులకు తాను ఉన్నాననే భరోసానిస్తూ ఆమె ధైర్యం చెప్పారు.

మంత్రి సీతక్క కేవలం పరామర్శకే పరిమితం కాకుండా, ఆశ్రమంలోని పిల్లల భవిష్యత్తుపై కీలక హామీలు ఇచ్చారు. ఆశ్రమంలో ఉంటున్న పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తామని, వారికి అవసరమైన బస, పౌష్టికాహారం మరియు ఇతర వసతులను ప్రభుత్వం తరపున మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. ఇన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఆశ్రమానికి పూర్తి సహకారం అందిస్తామని, పిల్లల బాధ్యతను ప్రభుత్వం విస్మరించదని ఆమె ఈ సందర్భంగా భరోసా కల్పించారు.

Excise Duty: పొగాకు వినియోగం తగ్గించడానికి కేంద్రం కొత్త చర్య

అనంతరం, మంత్రి సీతక్క సాగరం గ్రామంలోని ఇన్నయ్య నివాసానికి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఇన్నయ్య తల్లిదండ్రులను కలుసుకుని వారిని పరామర్శించారు. కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ వృద్ధులకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక సామాజిక కార్యకర్తగా ఇన్నయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, సమాజం కోసం పాటుపడే వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవడం బాధ్యతగా భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Excise Duty: పొగాకు వినియోగం తగ్గించడానికి కేంద్రం కొత్త చర్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha