Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు గట్టి కృషి

మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు గట్టి కృషి

వార్త 1 week ago

Narcotic drugs : మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) నేడు ప్రపంచ వ్యాప్తంగా మానవ సమాజాన్ని, ముఖ్యంగా ఆధునిక నాగరికతను వేధిస్తున్న అత్యంత ప్రమాదకరమైన సామాజిక సంక్షో భం.

ఒకప్పుడు కేవలం సంపన్న వర్గాలకో, విలాసవంతమైన నగరాలకో లేదా అంతర్జాతీయ స్మగర్ల రహస్య స్థావరాలకో పరిమితమైన ఈ వ్యసన సంస్కృతి, నేడు నిశ్శ బ్దంగా గ్రామీణ ప్రాంతాలకు, చివ రకు పల్లెల్లోని సామాన్య కుటుంబాలకు సైతం విస్తరించడం అత్యంత ఆందోళనకరం. దేశ ప్రగతికి, భవిష్యత్తుకు వెన్నె ” ముక లాంటి యువశక్తిని ఈ మహమ్మారి నీరుగారుస్తోంది. వ్యక్తిగత జీవితాలను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థలను, సామాజిక సం బంధాలను, దేశాల ఆర్ధిక వ్యవస్థలను సైతం దెబ్బతీస్తున్న ఈ దురాచారాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు నిరంతరం పోరాడుతున్నా యి.

 Narcotic drugs

Narcotic drugs : జాతీయ భద్రతకే పెనుసవాలు

మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వ్యాపా రాన్ని నిరోధించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాలదుర్వినియోగం అక్రమ ర వాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1987 డిసెంబర్ 7న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదిం చిన తీర్మానం 42/112 ప్రకారం ఈ దినోత్స వాన్ని నిర్వ హించాలని నిర్ణయించారు. ప్రపంచాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్యాలు నేరాల కార్యాలయం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. యువత మాదక ద్రవ్యాల బారిన పడటం అనేది కేవలం ఒక వ్యక్తిగత ఆరోగ్య సమస్య లేదా నైతిక పతనం మాత్రమే కాదు, అది ఒక కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి, ఆర్థిక నష్టానికి, శాంతిభద్ర తల క్షీణతకు, దేశ జాతీయ భద్రతకే పెనుసవాలుగా పరిణమించిన ఒక బహుముఖ సంక్షోభం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్యాలు, నేరాల నియం త్రణ సంస్థ విడుదలచేసిన అంతర్జాతీయ నివేదికలను పరి శీలిస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 కోట్లకు పైగా ప్రజలు వివిధ రకాల మాదకద్రవ్యాలను వినియోగిస్తుండగా, అందు లో సింహభాగం 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులే కావడం గమనార్హం.

సరిహద్దు రాష్ట్రాలు ఈడ్రగ్స్ మాఫియాకు ప్రధాన కేంద్రాలు

భారత దేశంలో కూడా గత దశాబ్దకాలంలో డ్రగ్స్ విని యోగం ఊహించని రీతిలో, గణనీయమైన శాతంలో పెరిగింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వ హించిన జాతీయ స్థాయిసర్వేల ప్రకారం, దేశంలో లక్షలాది మంది యువత సంప్రదాయ గంజాయి, ఆఫిముల తో పాటు హెరాయిన్, కొకైన్ వంటి ప్రాణాంతర డ్రగ్స్, ఎల్ఎస్ఈ, ఎండీఎంఏ, మెథాంఫెటమైన్ వంటి సింథటిక్, రసాయన పదార్థాలకు తీవ్రంగా బానిసలవుతున్నారు. ము ఖ్యంగా దేశఆర్థిక రాజధాని ముంబై, జాతీయ రాజధాని ఢిల్లీ తో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైవంటి ఐటీ హబ్ లు, పంజాబ్, మణిపూర్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ఈడ్రగ్స్ మాఫియాకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. యువత ఇంతలా ఈ వ్యసనాల వైపు ఆకర్షితులు కావడానికి వెనుక అనేక సామాజిక, మానసిక, సాంస్కృతిక కారణాలు దాగి ఉన్నాయి. ఆధునిక విద్యావ్యవస్థలో విపరీతంగా పెరిగిపో యిన పోటీ, మార్కులకోసం తల్లిదండ్రుల ఒత్తిడి, పరీక్షల భయం, ఉన్నత ఉద్యోగాల సాధనలో ఎదురవుతున్న వైఫ ల్యాలు యువతలో తీవ్ర మానసిక ఆందోళనకు దారితీస్తు న్నాయి. ఈ ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం, మానసిక ఒంటరితనాన్ని మరిచి పోవడం కోసం కొందరు ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీనికితోడు ‘పేర్ (ప్రెషర్’ అనబడే స్నేహితుల ఒత్తిడి, సమ వయస్కుల మధ్య తాము తక్కువ అయి పోకూడదనే అహంకారం కూడా ఒక ముఖ్య కారణం.

ఒక ‘ఫ్యాషన్గాగా, ఆధునికతకు ప్రతీకగా,

వీటన్నింటికీ మించి, ఆధునిక సమా జంలో వినోద మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిం ది. చలనచిత్రాలు, పాశ్చాత్య వెబ్ సిరీస్ లు, సామాజిక మాధ్యమాలలో డ్రగ్స్ తీసుకోవడాన్ని ఒక ‘ఫ్యాషన్గాగా, ఆధునికతకు ప్రతీకగా, గొప్ప సాహనంగా ఆకర్షణీయంగా చూపించడం వల్ల పసి మనస్సులు తప్పుదోవ పడుతున్నాయి. ఓ ప్రారంభంలో కేవలం కుతూహలంతోనో లేదా స్నేహి తుల ముందు గొప్పలు చెప్పుకోవడానికో ఒకసారి ప్రయ త్నించే సరదా, క్రమంగా మెదడును తన ఆధీనంలోకి తెచ్చు కొని జీవితాంతం వదిలించుకోలేని భయంకరమైన వ్యస నంగా మారిపోతోంది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు మొదటగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని పూర్తి గా చిన్నాభిన్నం చేస్తాయి. డ్రగ్స్ శరీరంలోకి ప్రవేశించగానే కేంద్ర నరాల వ్యవస్థపై, ముఖ్యంగా మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి మందగిం చడం, ఆలోచనా సామర్థ్యం హరించుకుపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి నష్టాలు వాటిల్లుతా యి. కాలక్రమేణా ఇది తీవ్రమైన మానసిక అస్థిరతకు, లేనివి ఉన్నట్లు ఊహించుకునే భ్రాంతులకు, ఆందోళన, తీవ్ర నిరా శను దారితీసి, చివరకు అతుహత్యా ఆలోచనలను రేకెత్తి స్తుంది. శారీరకంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ముఖ్య అవయవాలు క్రమంగా క్షీణిస్తాయి. మోతాదు మించి తీసుకోవడం వల్ల శ్వాస వ్యవస్థ స్తంభించి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్ష లాది మంది నడివయస్సులోనే ఆకస్మిక మరణాల బారిన పడు తున్నారు.

 Narcotic drugs

విద్యావ్యవస్థపై ప్రభావం

విద్యావ్యవస్థపై, విద్యార్థులపై ఈ ప్రభావం మరింత వినాశకరంగా ఉంటోంది. డ్రగ్స్కు బానిసైనవిద్యార్థి చదువుపై ఏకాగ్రతను పూర్తిగా కోల్పోతాడు. తరగతులకు హాజరు కాకపోవడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవ డం, చివరకు చదువును మధ్యలోనే విడిచిపెట్టడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ప్రవర్తనలో విపరీతమైనమార్పు లు వచ్చి, హింసాత్మకంగా మారడం, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. విద్యాసంస్థల్లో ఇటీవల కాలంలో తరచూ బయటపడుతున్న డ్రగ్స్ ముఠాల ఉదంతాలు, విద్యారంగాన్ని ఈ మహమ్మారి ఎంతలా కబ్జా చేసిందో స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తిగత వినాశనంతో ఆగని ఈ వ్యసనం, ఆ వ్యక్తి ఉన్న కుటుంబ వ్యవస్థను కూడా అగాధంలోకి నెట్టేస్తుంది. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి భారీ గా డబ్బు అవసరం కావడంతో, విద్యార్థులు లేదాయువకులు ఇంట్లో డబ్బు దొంగిలించడం, అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అది చాలనప్పుడు బయటమోసాలకు, చిన్న చిన్న నేరాలకు పాల్పడతారు. దీనివల్ల కుటుంబ ఆర్ధిక పరిస్థితి దిగజారడమే కాకుండా, సమాజంలో తల్లిదండ్రులు తలదిం చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. తమ బిడ్డ భవిష్యత్తు నాశనమవడాన్ని చూస్తూ ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వేదన వర్ణనాతీతం. ఈ మాదక ద్ర వ్యాల వ్యాపారా నికి, నేర ప్రపంచానికి అవినాభావ సంబంధం ఉంది.

మాఫియా ముఠాలకు ప్రధాన ఆదాయ వనరు

ఇది అంతర్జాతీయ మాఫియా ముఠాలకు ప్రధాన ఆదాయ వన రుగా మారింది. భౌగోళికంగా భారతదేశం అక్రమ రవాణాకు అత్యంత అనుకూలమైన, ప్రమాదకరమైన ప్రాంతంలో ఉంది. పశ్చిమాన ఇరాన్, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్లతో కూడిన ‘గోల్డెన్ క్రెసెంట్’ (బంగారు నెలవంక) ప్రాంతం, తూర్పున మయన్మార్, థాయిలాండ్, లావోస్లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’ (బంగారు త్రిభుజం) ప్రాంతాల మధ్య భారత్ విస్తరించి ఉండటం వల్ల, అంతర్జాతీయ స్మగ్లర్లు దేశ సరి హద్దులను సులభంగా వాడుకుంటున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ చట్టాన్ని అమలుచేస్తోంది. ఈ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల ఉత్పత్తి, ర వాణా, విక్రయం, నిల్వ, వినియోగం వంటి చర్యలు కఠినశిక్షార్హమైన నేరాలు. అయిన ప్పటికీ సమస్య పూర్తిగా అదుపులోకి రావడం లేదు. పాఠశా లలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల ప్రమాదాలపై నిరంతర అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిం చాలి. సమాజంలోని ప్రతివర్గం ఈ సమస్యను కేవలం వ్యక్తి గత సమస్యగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ముఖ్యంగా వ్యసనానికి గురైన వారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా పరిగణించి వారికి వైద్య చికిత్స, మానసిక సలహా, పునరావాస సేవలు అందించాలి.

-రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

జులై 15 నుండి భారీగా తగ్గనున్న విదేశీ వస్తువుల ధరలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha