The Game Changers reality show: ప్రముఖ నటుడు మాధవన్ త్వరలో బుల్లితెరపై కొత్త పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటివరకు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఆయన..
ఇప్పుడు ఓ బిజినెస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 'ది గేమ్ ఛేంజర్స్: మిడిల్ ఈస్ట్' పేరుతో తెరకెక్కుతున్న ఈ షోకు మాధవన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు నిర్మాణ సంస్థ ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది.
Chuttamalle Song AI:జాన్వీ 'చుట్టమల్లే' డీప్ ఫేక్ వీడియో పై మంచు విష్ణు రియాక్షన్
స్టార్టప్ ఫౌండర్లతో బిజినెస్ షో

ఈ బిజినెస్ రియాలిటీ షోలో వివిధ దేశాలకు చెందిన స్టార్టప్ ఫౌండర్లు పాల్గొననున్నారు. తమ వ్యాపార ఆలోచనలు, కొత్త బిజినెస్ మోడల్స్‌ను అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ప్యానల్ ముందు వారు ప్రదర్శించనున్నారు. పెట్టుబడిదారులను ఆకట్టుకుని తమ వ్యాపారాలకు నిధులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా కంటెస్టెంట్లు తమ ఐడియాలను వివరించనున్నారు. వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఈ షో ప్రత్యేకంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
The Game Changers reality show: దుబాయ్ కేంద్రంగా చిత్రీకరణ
పశ్చిమాసియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని దుబాయ్ కేంద్రంగా నిర్వహించనున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే స్టార్టప్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇందులో భాగం కానున్నారు. ఈ షో చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. మాధవన్ హోస్ట్‌గా వ్యవహరించనుండటంతో కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. నటుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న మాధవన్.. బిజినెస్ రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
Epaper: epaper.vaartha.com

