Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ సీఐపై అత్యాచారం కేసు!

మాజీ సీఐపై అత్యాచారం కేసు!

వార్త 1 month ago

CI Chinna Mallaiah Rape Case: పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ సీఐ చిన్న మల్లయ్యపై లైంగిక దాడి ఆరోపణలు రావడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read Also: Visakha Express Assault Case Updates: విశాఖ ఎక్స్‌ప్రెస్ అత్యాచార ఘటన.. నిందితుడు అరెస్ట్

మాజీ సీఐపై అత్యాచార ఆరోపణలు.. పోలీసులకు మహిళ ఫిర్యాదు

వినుకొండ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఒక నాటు కోళ్ల ఫారంను బాధితురాలు అద్దెకు తీసుకుని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఐ చిన్న మల్లయ్య తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫారం వద్ద ఉన్న సమయంలో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టి అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.

CI Chinna Mallaiah Rape Case: కేసు నమోదు.. వైద్య పరీక్షలకు తరలింపు

మహిళ ఫిర్యాదును స్వీకరించిన వినుకొండ పోలీసులు మాజీ సీఐ చిన్న మల్లయ్యపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని ప్రాథమిక ఆధారాల సేకరణ మరియు వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, నిజానిజాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బెడ్ రూంలో భార్య.. బాత్ రూంలో భర్త ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha