Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాకు 'PM కేర్స్' నుంచి ఫండింగ్ వస్తోంది - CJP సెటైర్

మాకు 'PM కేర్స్' నుంచి ఫండింగ్ వస్తోంది - CJP సెటైర్

వార్త 2 weeks ago

CJP : భారతీయ సిటిజన్స్ పార్టీ (CJP) విదేశీ నిధుల (Foreign Funding) సాయంతో నడుస్తోందంటూ వస్తున్న విమర్శలపై ఆ పార్టీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రస్థాయిలో స్పందించారు.

ఓ ప్రముఖ టీవీ వార్తా విశ్లేషణ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ఈ ఆరోపణలను చమత్కారంగా తిప్పికొడుతూ "మాకు 'PM కేర్స్' ఫండ్ నుంచి డబ్బులు వస్తున్నాయి" అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత గురించి మాట్లాడేవారు ముందుగా PM కేర్స్ ఫండ్‌కు వచ్చే నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారో సమగ్రంగా ఆడిట్ చేయించాలని, ఆ వివరాలను ప్రజల ముందు ఉంచి నిజాలను వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు.

 CJP Role

సోషల్ మీడియాలో వైరల్ & లభించిన మద్దతు

అశుతోష్ రాంకా ఈ డిబేట్ వీడియో క్లిప్‌ను తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకోవడంతో అది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ "ఆశూ సూపర్" అంటూ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఈ పరిణామంతో సిజెపి నాయకులు, మద్దతుదారులు సదరు వ్యాఖ్యలను నెట్టింట పెద్దఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ప్రత్యర్థులు చేసే నిరాధార ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా, ప్రభుత్వ నిధుల లభ్యత, ఆడిటింగ్ అంశాలపై చర్చ లేవనెత్తడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం: అమిత్ షా రాజీనామా చేయాల్సిందే - రాహుల్ గాంధీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha