Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాంసం ప్రియులకు పెద్ద షాక్

మాంసం ప్రియులకు పెద్ద షాక్

వార్త 1 week ago

Chicken prices:పండుగ సీజన్ రాకతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఒక్కసారిగా బాంబోల్లా పేలాయి. గత 2 వారాల్లోనే కిలో చికెన్ పై రూ.50 కి పైగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ రేటు రూ.280 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. పండుగ రోజుల్లో మాంసం కొనుగోళ్లు విపరీతంగా పెరగడమే ఈ రికార్డు స్థాయి ధరలకు అసలు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ISWAI : భారత ఆర్థిక వ్యవస్థలో ఆల్కోబెవ్ రంగానికి మైలురాయి

 Chicken prices have risen sharply.

హైదరాబాద్‌లో కిలో చికెన్ ఎంత ఉందో చూస్తే గుండె గుభేలే

భాగ్యనగరంలో మార్కెట్ డిమాండ్ ఆధారంగా చికెన్ రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. నగరంలో ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ కొనాలంటే రూ.278 చెల్లించాల్సి వస్తోంది. అలాగే డ్రస్డ్ చికెన్ ధర రూ.246 వద్ద కొనసాగుతుండటం గమనార్హం. ఇక పౌల్ట్రీ ఫారం వద్ద లైవ్ బర్డ్ ధర రూ.132 ఉంటే, రిటైల్ మార్కెట్లో మాత్రం రూ.159 కి విక్రయిస్తున్నారు.

Chicken prices:విజయవాడ వాసులకు చికెన్ మంట – అక్కడ రేట్లు ఎలా ఉన్నాయంటే

బెజవాడ ప్రాంతంలో చికెన్ ప్రియుల జేబులకు పెద్ద కన్నమే పడుతోంది. ఇక్కడ ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.284 గా ఉంది. డ్రస్డ్ చికెన్ ఏకంగా రూ.251 కి అమ్ముడవుతోంది. ఫారం దగ్గర లైవ్ బర్డ్ ధర రూ.135 ఉండగా, బయట రిటైల్ మార్కెట్లో రూ.162 కి చేరుకుంది. పండుగ రోజులు దగ్గర పడుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు

Epaper: epaper.vaartha.com

ఈ నెల 19 వరకు దరఖాస్తులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha