Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మావిగన్'పై మాట్లాడాలంటే జగన్ అసెంబ్లీకి రావాలి: విష్ణుకుమార్ రాజు

'మావిగన్'పై మాట్లాడాలంటే జగన్ అసెంబ్లీకి రావాలి: విష్ణుకుమార్ రాజు

వార్త 2 weeks ago

Vishnu Kumar Raju: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా 'మావిగన్' (Mavigan) అంటూ మాట్లాడటం శోచనీయమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా విమర్శించారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జగన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మాట మార్చిన జగన్: విష్ణుకుమార్ రాజు విమర్శలు

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతి రాజధానికి పూర్తి మద్దతు ప్రకటించిన జగన్, 2019లో ముఖ్యమంత్రి కాగానే మూడు రాజధానుల ముసుగులో మాట మార్చారని విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే ఏకైక రాజధానిగా అంగీకరించిన తర్వాత కూడా, జగన్ ఇంకా రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే, అది ఓర్వలేకనే జగన్ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Vishnu Kumar Raju: ప్రెస్ మీట్లు కాదు.. అసెంబ్లీలో చర్చించండి!

జగన్ నిజంగా ‘మావిగన్’ అంశంపై మాట్లాడాలనుకుంటే, మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా ధైర్యంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రావాలని విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. చట్టసభను వదిలి బయట మాట్లాడటం సరికాదన్నారు. విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాలను ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజలందరికీ ఉపయోగపడేలా వినియోగించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి సూచించారు. అలాగే, ‘సర్’ (Survey) పేరుతో అర్హులైన ఎవరి ఓట్లను కూడా తొలగించడం లేదని, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.

Epaper: epaper.vaartha.com

ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. విశాఖ - బెంగళూరు వీకెండ్ స్పెషల్ రైళ్లు పొడిగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha