Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle Crime: బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

Madanapalle Crime: బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

వార్త 3 months ago

Madanapalle Crime: ఆంధ్రప్రదేశ్ లోని, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక బాలికపై జరిగిన ఈ ఘోరమైన నేరం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలవరపరిచింది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు.

Bonded Labour Abolition: వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

హోం మంత్రి వంగలపూడి అనిత కూడా చిన్నారి తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని.. కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని బాలిక కుటుంబానికి తెలిపారు.

అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు

వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఏడేళ్ల బాలిక, చివరకు శవమై తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, బాలిక మృతదేహాన్ని ఎదురింట్లో గుర్తించారు. ఆ ఇంట్లో నివసించే కులవర్ధన్ అనే వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు మదనపల్లె-కదిరి బైపాస్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా ఎస్పీ, సబ్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha