Tamil Nadu road accident: తమిళనాడులోని మధురై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమదం లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఎంతో సంతోషంగా దైవ దర్శనం ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కాలయముడు ప్రమాదం రూపంలో వారిని కబళించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also : CM Vijay : సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుపట్టిన విశాల్

Tamil Nadu road accident: వివరాల ప్రకారం.. మధురైలోని అన్నానగర్‌కు చెందిన ప్రకాష్, అతని బంధువు రమేష్‌తో పాటు మరో ముగ్గురు మహిళలు కలిసి తిరుచిరాపల్లిలోని సమయపురం మరియమ్మన్ ఆలయానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం స్వామివారి దైవదర్శనం ముగించుకుని, అందరూ కలిసి కారులో తిరిగి మధురైకి బయలుదేరారు. కారు మేలూరు సమీపంలోని అయ్యపట్టి వద్దకు చేరుకోగానే హైవేపై ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న బ్యారియర్‌ను చాలా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే కన్నుమూశారు.
సమాచారం అందుకున్న కొట్టంపట్టి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం మేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల లేదా వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
మామిడి పండ్లు తిని ఐదేళ్ల బాలుడు మృతి.. ఇద్దరికి తీవ్ర అస్వస్థత!

