Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madhya Pradesh Crime: పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

Madhya Pradesh Crime: పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

వార్త 2 months ago

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమై నెల రోజులు కూడా గడవకముందే, ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇన్ స్టాగ్రామ్ ద్వారా మొదలైన ఒక ప్రేమ వ్యవహారమే ఈ ఘోర హత్యకు దారితీసింది.

Farooq Abdullah: జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

ఘటన నేపథ్యం, హత్యకు కుట్ర

సిధి జిల్లాకు చెందిన అజయ్ వైశ్య (24) కు, ఉమా వైశ్యకు గత ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. ఈ క్రమంలో మార్చి 7న ఉమాను అజయ్ తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు, ఆమె ప్రేమికుడు అమర్ బహదూర్, అతని ఫ్రెండ్‌తో కలిసి చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి గొంతు కోసి, రాయితో దాడి చేసి హత్య చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha