Dailyhunt
Madhya Pradesh: గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

Madhya Pradesh: గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

వార్త 2 months ago

ధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని తికాంగఢ్ జిల్లా పలేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన గురువు నుంచే ఇలాంటి దారుణం జరగడం స్థానికంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఓ ఉపాధ్యాయుడు.. చిన్నారిపై కన్నేశాడు. బుజ్జి బుజ్జి మాటలతో, ఎవరూ చూసిన ముద్దు చేయాలనిపించే ఆ చిన్నారిపై..మనసు పడ్డాడు. అందరి ముందే ఆ చిన్నారిని లొంగదీసుకుని బడిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న ఆ పసిపాప జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది.

AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నాం

చిన్నారి చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు.. వెంటనే గ్రామస్థులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు.ఉపాధ్యాయుడిని నిలదీస్తూనే.. అథడికి కఠినంగా శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ అప్పటికే సదరు ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్లిపోగా.. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పలేరా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ చిన్నారికి జరిగిన దారుణం గురించి వివరించి.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బడిలోని ఉపాధ్యాయుల వల్లే పిల్లలకు రక్షణ లేకపోతే ఎలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తికాంగఢ్ అదనపు పోలీస్ సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలలో మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ధృవీకరించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ మర్నాడే స్థానిక కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అతడిని మళ్లీ జైలుకు తరలించినట్లు స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

TTD: శ్రీవారి బంగారం, వెండి డాలర్ల విక్రయాలపై కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha