Dailyhunt
Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

వార్త 3 months ago

ధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కలుషిత తాగునీటి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మున్సిపల్ కుళాయి నుంచి వచ్చిన నీటిని పాలలో కలిపి తల్లి తన 6 నెలల పసికందుకు తాగించగా, కొద్దిసేపటికే బిడ్డకు వాంతులు మొదలయ్యాయి.

ఆందోళన చెందిన తల్లి వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే ప్రాంతంలో కలుషిత నీటివల్ల పలువురు అనారోగ్యానికి గురవ్వడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

Read also: Delhi Crime: కదులుతున్న వ్యాన్ లో యువతిపై సామూహిక అత్యాచారం

Madhya Pradesh

పదేళ్ల పాటు ఎదురుచూసిన తర్వాత ఈ బిడ్డ జన్మించిందని, ఇప్పుడు ఇలా కోల్పోవాల్సి రావడం తల్లిదండ్రుల హృదయాలను చీల్చేసింది. ఇదే కుటుంబంలో ఉన్న 10 ఏళ్ల పెద్ద కూతురు కూడా కడుపునొప్పితో బాధపడుతోంది. కలుషిత నీటి సరఫరాపై అధికారులు నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి శుద్ధి చేసిన తాగునీటి ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Delhi ED Raid: ఓ ఇంటిపై ఈడి దాడి.. కోట్లాది రూపాయలు స్వాధీనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha