Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యం మత్తులో బరితెగించిన కొడుకు.. కన్నతల్లి సహా ముగ్గురిని చంపి డ్రైవర్ ఆత్మహత్య!

మద్యం మత్తులో బరితెగించిన కొడుకు.. కన్నతల్లి సహా ముగ్గురిని చంపి డ్రైవర్ ఆత్మహత్య!

వార్త 0 months ago

Bengaluru Triple Murder: బెంగళూరు నగరంలో వరుస క్రైమ్ ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కామాక్షిపాళ్య మద్యం మత్తు, క్షణికావేశం కారణంగా ఒక డ్రైవర్ తన కన్నతల్లితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా బలితీసుకున్నాడు.

ఆపై స్థానికులు, పోలీసులు తరిమేసరికి తప్పించుకునే దారి లేక తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకుడి పేరు ప్రశాంత్ (34). వృత్తిరీత్యా డ్రైవర్ అయిన ఇతను కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్టిగెపాళ్యలో నివాసముంటున్నాడు.

గత ఏడెనిమిది సంవత్సరాలుగా కొట్టిగెపాళ్యలోని ప్రసిద్ధ గణేషుడి ఆలయం సమీపంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, గత ఏడాది కాలంగా ప్రశాంత్ ఎలాంటి పనిపాట చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. పితృార్జితంగా వచ్చిన ఆస్తిని అమ్ముకుంటూ, ఆ డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే చెడు తిరుగుళ్లకు అలవాటుపడి పూర్తిగా మద్యానికి బానిస అయ్యాడు.

Read Also : Breaking News : ఫు క్వోక్ ద్వీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా

 Driver kills three people, including his own mother, while intoxicated and then commits suicide!

Bengaluru Triple Murder: ఉదయాన్నే మొదలైన ఘర్షణ.. అడ్డువచ్చిన వారిపై కత్తితో దాడి

ప్రశాంత్ రోజూ తాగి వస్తుండటంతో ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. ఏదైనా పని చేసుకొని బతకాలని, ఆస్తి డబ్బులు తగలేయవద్దని తల్లి మంగళమ్మ తరచూ కొడుకును మందలించేది. ఎప్పటిలాగే శనివారం ఉదయం కూడా తల్లి, కొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ప్రశాంత్ తల్లిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ మేనమామ సతీష్ వెంటనే అక్కడికి చేరుకుని ప్రశాంత్‌ను గట్టిగా నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో తీవ్ర ఉన్మాదానికి లోనైన ప్రశాంత్.. ఇంట్లోనే ఉన్న పెద్ద మచ్చుకత్తిని తీసుకుని కన్నతల్లి మంగళమ్మను పొడిచి చంపాడు.

తప్పించుకోలేక ఉరి

రక్తపు మడుగులో పడి ఉన్న మంగళమ్మను కాపాడేందుకు, ప్రశాంత్‌ను అడ్డుకునేందుకు అక్కడ ఉన్న నానమ్మ నంజమ్మ, మేనమామ సతీష్ ప్రయత్నించారు. అయితే కళ్లు మూసుకుపోయిన ఉన్మాది ప్రశాంత్.. వారిద్దరిని కూడా కత్తితో దారుణంగా నరికి అక్కడికక్కడే హతమార్చాడు. ఇంట్లో నుంచి వస్తున్న భయానక కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకుడు ప్రశాంత్‌ను పట్టుకునేందుకు చుట్టుపక్కల వారు ఇల్లును చుట్టుముట్టారు. అలాగే కామాక్షిపాళ్య పోలీసులకు కూడా సమాచారం అందించారు.

తాను చేసిన ఘోరానికి ఇక చట్టం నుండి, స్థానికుల నుండి తప్పించుకునే అవకాశం లేదని గ్రహించిన ప్రశాంత్.. లోపలి నుంచి తలుపులు గడియ పెట్టుకుని ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌తో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒకే ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

బద్రీనాథ్‌ ఆలయంలో విరాళాల దుర్వినియోగంపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha